* కేవలం ఒక్క గుడ్డు కామెంట్ తో ఫేమస్ అయిన అమర్నాథ్

* ట్రోలర్స్ కు విందు భోజనంలా మారిన అమర్నాథ్ కామెంట్స్..

* అసలైన ఐటీ శాఖ మంత్రి అంటూ నెటిజన్స్ పొగడ్తల వర్షం


ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ సంచలన విజయం సాధించింది.. ఏకంగా 151 సీట్లు సాధించి చరిత్ర సృష్టించింది.. ఆ ఎన్నికల కోసం జగన్ చేసిన పాదయాత్ర ఎంతో సక్సెస్ అయింది.వైసీపీ లో ముఖ్య నాయకులకు జగన్ మంత్రి పదవులను అందించారు. అంతే కాదు వారికి ఒక కండిషన్ కూడా పెట్టారు. ఈ మంత్రి పదవి కేవలం రెండున్నర ఏళ్లు మాత్రమే ఉంటుందని ఆ తరువాత మంత్రి వర్గ విస్తరణలో కొందరికి పదవీ ఉండొచ్చు పోవచ్చు చెప్పలేము అని తెలిపారు. ఇలా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఐటీ శాఖ మంత్రిగా వున్న నారా లోకేష్ పలు కంపెనీలను ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టేందుకు తీసుకువచ్చారు.కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో కొత్త కంపెనీలు రావడం పక్కన ఉంచితే వున్న కంపెనీలను సైతం విపరీతమైన రూల్స్ తో పక్క రాష్ట్రంకు వెళ్లేలా చేస్తున్నారని టీడీపీ నాయకుడు నారా లోకేష్ గతంలో ఆరోపించారు..

ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల తరువాత అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటలు యుద్ధం కొనసాగింది.. ఏ చిన్న అవకాశం దొరికిన ఎవరు ఎవరిని టార్గెట్ చేయాలి అన్న దానిపైన ప్రధానంగా దృష్టి సారించారు.. మాట్లాడే మాటల్లో తప్పు దొరికితే చాలు వెంటనే టార్గెట్ చేసేస్తున్నారు. టిడిపి నాయకులు మాట్లాడిన మాటలకు కౌంటర్లు వేస్తూ వైసిపి, వైసీపీ మంత్రులు, నాయకులు మాట్లాడిన వాటికి కౌంటర్లు వేస్తూ టిడిపి నాయకులు రివర్స్ కౌంటర్లతో ఎంతో హంగామా చేసారు..అయితే ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేసిన సంగతి అందరికి గుర్తే ఉంటుంది..ఆయన గతంలో చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పటికీ వైరల్ అవుతుంది.

గతంలో హైదరాబాద్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ కు ఏపీ ప్రభుత్వం తరఫున అతిథుల్లో ఒకరిగా అప్పటి ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా వెళ్ళారు. అక్కడ ఫార్ములా ఈ రేసింగ్ ను ఆయన చూశారు. అలాగే తెలంగాణ మంత్రి కేటీఆర్ తో ఆయన చట్టా పట్టాలేసుకుని కూడా తిరిగారు. ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఫార్ములా రేస్ లు ఎప్పుడు నిర్వహిస్తారు అని విలేకరులు అడిగిన ప్రశ్నకు గుడివాడ అమర్నాథ్ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. ఇక ఆ సమాధానమే ఆయన కొంపముంచింది.
 

కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు.. కోడి కోడిని పెట్టలేదు కదా.. సో ముందుగా కోడి గుడ్డు పెట్టాలి. దాన్ని హ్యాచ్ చేయాలి. దాన్ని కోడిగా మార్చాలి. ఏపీలో ఇప్పుడే కోడి గుడ్డు పెట్టింది దాన్ని కోడిపెట్టగా మార్చడానికి టైం పడుతుంది అంటూ కోడిపురాణం చెప్పారు..ఈ ఫార్ములా రేసుల గురించి అడిగితే కోడి పురాణం చెప్పారంటూ ఆయనను టార్గెట్ చేస్తూ నెటిజన్లు. తెలుగుదేశం పార్టీ నేతలు విపరీతంగా ట్రోల్ చేసారు. ఆ ఒక్క మాటతో గుడివాడ అమర్నాథ్ బాగా పాపులర్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: