
- ఆయన మాట్లాడితే అసెంబ్లీ అంతా నవ్వుల పంటే.?
- మాజీ మంత్రి మల్లారెడ్డి మాట తీరే వేరు.!
కేసీఆర్ ప్రభుత్వంలో అత్యంత కీలక లీడర్ గా ఎదిగిన నాయకులలో మల్లారెడ్డి కూడా ఒకరు. ఎంత పెద్ద సబా అయినా సరే మల్లారెడ్డి స్పీచ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారంటే ఎంత సీరియస్ సభ అయిన నవ్వుల పంట పండాల్సిందే. ఆ విధంగా సబ్జెక్టును మాట్లాడుతూనే కాస్త నవ్వు తెప్పించే డైలాగ్ విసరడంలో మల్లారెడ్డి దిట్ట అని చెప్పవచ్చు. ఆయన ఏదైనా విషయాన్ని చెప్పాలంటే తప్పనిసరిగా ఆ సబ్జెక్టులో కాస్త కామెడీగా సామాన్య జనానికి కూడా అర్థమయ్యే రీతిలో చెబుతూ ఉంటారు. ఆయన డైలాగుతోనే ఎదుటి వ్యక్తులకు పంచులు విసురుతారు. ఈ విధంగా ట్రోలింగ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ గా ఉన్నారు మల్లారెడ్డి.
ట్రోలింగ్ కింగ్ మల్లారెడ్డి:
మాజీ మంత్రి మల్లారెడ్డి 2014 మార్చి 19న తెలుగుదేశం పార్టీ ద్వారా తన రాజకీయ అరంగేట్రం చేశారు. ఇదే సంవత్సరం ఏప్రిల్ 9న మల్కాజ్ గిరి పార్లమెంటు నుంచి టిడిపి టికెట్ ఖరారు చేసింది. ఈ పార్లమెంట్ నుంచి ఆయన ఘనవిజయం సాధించారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ నుంచి పార్లమెంటు గెలిచిన ఏకైక సభ్యుడు మల్లారెడ్డి. 2016 జూన్ నెలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి ఆ తర్వాత 2018 మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2019 కేసీఆర్ మంత్రివర్గంలో కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ విధంగా మల్లారెడ్డి తన రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు అనుభవిస్తూనే ఫేమస్ లీడర్ గా మారారు. పూర్వకాలం మనుషుల్లా మాట్లాడే మల్లారెడ్డి ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, పెట్టి ఎంతో మంది విద్యార్థులకు విద్యానందిస్తున్నారు. ఈ విధంగా తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని లీడర్ గా ఉన్న మల్లారెడ్డి ట్రోలింగ్ ల ద్వారా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాడు.