రాజకీయాలలో ఎప్పుడూ కూడా ఎవరిది పై చేయి అనే విషయం చెప్పడం చాలా కష్టం.. అందుకే అవకాశాలు వచ్చినప్పుడే రాజకీయ నేతలు మారిపోతూ ఉంటారు. ఎంత ఇలా ఉండగా ఉత్తరాంధ్రలో దిగ్గజనేతగా పేర్కొందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైసిపి నుంచి ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. దీంతో సక్సెస్ ఫుల్ గా ఆయన శాసనమండలిలో కూడా అడుగుపెట్టబోతున్నారు. వాస్తవానికి బొత్స సీనియర్ నేతకు ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ పడడం అంటే అందరూ మొదట ఆశ్చర్యపోయారు. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం తానైతేనే నెగ్గుకు రావాలనని భావించిన చివరికి జగన్ మాట నిజమయి విజయాన్ని అందుకున్నారు బొత్స.


బొత్స వల్ల కూటమి కూడా తట్టుకోలేకపోయిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. టిడిపి కూటమి కనుక పోటీలో నిలబడి ఉంటే కోట్లాది రూపాయల ఖర్చు చేయవలసి ఉండేది.. కానీ వైసీపీలో మాత్రం అంతటి డబ్బు పెట్టుకోవడానికి ఎవరు మక్కువ చూడడానికి ఇష్టపడలేదు. అయితే కేవలం బొత్స తో ఉన్నటువంటి అనుబంధం వల్ల చాలామంది ఆయనకు సపోర్టుగానే ఉంటామని తెలిపారుట. అందుకే వైసిపి అధినేత జగన్ కూడా ఆయన పేరుని ప్రకటించినట్లు తెలుస్తోంది.


బొత్స ఎమ్మెల్సీ గానే ఉంటారా అంటే అది కుదిరేలా కనిపించడం లేదట..బొత్స కూడా పోటీ చేసేటప్పుడే ఒక కండిషన్ పెట్టారని వార్తలు వినిపిస్తోంది. బొత్సకు శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారట. అయితే ఇది ప్రస్తుతం ఉన్న అధినేత జగన్ కంటే ఉన్న స్థితి కంటే పెద్ద పదవి.. అయితే ఈ పదవి తనకి ఇవ్వడం వల్ల జగన్ ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీలో ఉండాల్సి ఉంటుందట. కానీ ఏది ఏమైనా బొత్స తన బలంతో వైసిపిని మరొకసారి గట్టెక్కించారని చెప్పవచ్చు. అంతేకాకుండా వైసిపి కార్యకర్తలకు నేతలకు కూడా మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా చేశారు.2024 ఎన్నికలలో వైసిపి గౌరవ ఓటమి తర్వాత ఎమ్మెల్సీ ఎన్నిక కాస్త ఊరడం ఇచ్చింది అది కూడా బొత్స వల్లే..

మరింత సమాచారం తెలుసుకోండి: