పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎం.. పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో కీలక భూమిక పోషిస్తున్న పవన్ కళ్యాణ్ ఎన్నికలు ముందు పిఠాపురం నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రానికి ఆదర్శంగా ఉండేలా పిఠాపురం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు.ఈ నేపధ్యం లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. మొట్టమొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి, ప్రసంగించారాయన. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్న మైందన్నారు.స్వతంత్రం వచ్చిందని ఆనంద పడే కంటే దేశ బాధ్యతను గుర్తుచేసుకునే రోజు అని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ప్రతి మహిళకు భద్రత కల్పిస్తామని తెలిపారు. ఆడపిల్లల, మహిళల  శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు.ఆ ఆలోచనే తనను ఈ పదవిలో కూర్చోబెట్టిందని పవన్ కల్యాణ్ తెలిపారు.రాష్ట్రంలో ఆడపిల్లల జోలికి ఎవరు వచ్చినా ఊరుకునేది లేదన్నారు. ఇదే విషయాన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో చెప్పామన్నారు. యువతకు ఉపాది అవకాశాలు కల్పించడం మాటల్లో కాదు, చేతల్లో చేసి చూపిస్తామన్నారు.

లక్షలాది అమరుల త్యాగాల ద్వారా లభించిన స్వాతంత్య్ర దినోత్సవాన్ని వేడుకగా జరుపుకుంటున్నామన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. వేడుకలు జరుపుకుని ఆనందించడం సరిపోదని, ప్రతీ ఒక్కరూ దేశం పట్ల తమ బాధ్యతను గుర్తుచేసుకోవాల్సిన రోజన్నారు.దీంతో పాటు ఎర్రచందనం వేలం వేసి కర్ణాటక ప్రభుత్వం ఆ డబ్బును సంక్షేమ పథకాలను వినియోగించిందన్నారు. కానీ ఇక్కడ ఎర్ర చందనం మాత్రం దొంగల బారిన పడుతుందన్నారు. కొత్త నాయకత్వం తయారు కావాలన్న ఆయన తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందించే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. తనకు కొన్ని పరిమితులున్నాయని, దాని మేరకే పని చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా జాతీయజెండా ఎగురవేసిన పవన్ కళ్యాణ్‌..అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. అపర కాళీ అంటూ ఇందిరాగాంధీని గుర్తు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌..రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి పథకం తెచ్చిన ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో… అన్న క్యాంటీన్లతో 5రూపాయలకే భోజనం పెట్టే పథకం ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: