టిడిపి పార్టీ 2024లో కూటమిలో భాగంగా పోటీ చేయడం జరిగింది.. గెలిచినప్పటికీ దీంతో చాలామంది సీనియర్ నేతలకు ఎలాంటి పదవులు కూడా ఇవ్వలేదు. గతంలో సీనియర్లు సైతం టిడిపి పార్టీకి పట్టుకొమ్మలుగా ఉన్నప్పుడు ఒంటి చేత్తో నడిపించారు. కానీ ఇప్పుడు వారి హవా మాత్రం చల్లడం లేదట. దీంతో కూటమి నేతలలో సీనియర్లు సైతం అసంతృప్తితో ఉన్నట్లు చాలామంది నేతలు ఇప్పటికే తెలియజేశారు. అయితే గతంలో టికెట్లు ఇచ్చే సమయంలో కూడా చాలామంది సీనియర్లను పక్కన పెట్టి మరి కొత్తవారికి కూడా అవకాశాలు కల్పించారు.


ఇక అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో అనుసరించిన తీరుని ఇప్పుడు మళ్లీ కూడా అనుసరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నామినేటెడ్ పదవులలో అత్యధికంగా శాతం జూనియర్లనే ఎంచుకోవడం జరుగుతోంది. యువతకి టిడిపి పార్టీ పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది దీంతో సీనియర్లు సైతం ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నారట. అయితే టిడిపి పార్టీ మాత్రం ఇప్పుడు యంగర్స్ కి అవకాశం ఇస్తే 2029 ఎన్నికలలో వారు పోటీ చేసే అవకాశం ఉంటుందని అప్పుడు మార్చాల్సిన పరిస్థితి ఏమి ఉండదని భావించినట్లు తెలుస్తోంది.


సీనియర్ నేతలకు సైతం పదవులు ఇస్తే ఖచ్చితంగా పార్టీ మళ్లీ ఓల్డ్ డేస్ లుక్ లోకి పోతుందని అందుకే యంగ్ జనరేషన్ ని సీఎం చంద్రబాబు కూడా సపోర్ట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కానీ సీనియర్లు మాత్రం తమకి కాకపోయినా తమ వారసులకైన నామినేటెడ్ పదవులు దక్కాలని చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే టిడిపి మాత్రం ఇలాంటి వాదనను అసలు పట్టించుకోవడం లేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా చాలాసార్లు సీనియర్ నేతలను సైతం పక్కన పెట్టాలని ఆలోచించిన వచ్చినప్పటికీ కొన్ని కారణాల చేత కొంతమందిని మాత్రమే పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో సీనియర్ నేతలు సైతం కూటమి ప్రభుత్వంలో అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వారిని ఏ విధంగా ఏపీ సీఎం చంద్రబాబు కన్విన్స్ చేస్తారు చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: