వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన మాజీ మంత్రి రోజా, అదే పార్టీలో మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాసుల పైన సిఐడి కి సైతం ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో వారి విషయం తేల్చాలి అంటూ కూడా సిఐడి అధికారులు నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు గత ఐదేళ్లలో టిడిపి అధినేత చంద్రబాబు పైన ఆయన కుమారుడు లోకేష్ పైన వ్యతిరేకంగా వీరు విరుచుకు పడడం జరిగింది.అప్పట్లో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఎన్నికల తర్వాత వీరంతారు సైలెంట్ గా మారిపోయారు.


ఎక్కడా కూడా ఎవరి గురించి ఏమాత్రం మాట్లాడడం లేదు. గతంలో రోజా మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవకతవకల గురించి రాజకీయాలలో వార్తలు వినిపిస్తూ ఉండడంతో కబడి జాతీయ క్రీడాకారుడు ఆర్డి ప్రసాద్.. రోజా, మాజీమంత్రి ధర్మాన పైన జూన్ నెలలోనే ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.. ముఖ్యంగా వైసిపి హయాంలో చేసినటువంటి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా భారీగా అవినీతి పాల్పడ్డారని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సంబంధించి వృధా చేశారని కూడా ఫిర్యాదులో తెలియజేశారట. దీంతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పైన విచారణ జరిపి అందులోని నిజాలు బయటికి తేవాలి అంటూ ఈ ఫిర్యాదులు తెలియజేసినట్లు సమాచారం.


అయితే ఈ ఫిర్యాదును సైతం సిఐడి అధికారులు స్వీకరించి విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఈ కేసును పంపించినట్లు తెలుస్తోంది.  ఆర్ డి ప్రసాద్ ఫిర్యాదు చేయక ఈ మేరకు రోజా, ధర్మాన కృష్ణ దాసుల పైన కూడా చర్యలు తీసుకోబోతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ఖచ్చితంగా వీరు విచారణకు సిద్ధం కావాల్సి ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటికే జోగి రమేష్ టిడిపి అధినేత ఇంటిపైన జరిగిన దాడి కేసులో కూడా ఉన్నారు. వీరితోపాటు అప్పిరెడ్డి, రఘురాం, దేవినేని అవినాష్, సురేష్ వంటి వారు కూడా పలు రకాల కేసులు ఎదుర్కొంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి కూడా జైల్లో ఉన్నారు. మరి ఇప్పుడు రోజా ధర్మాన పరిస్థితి ఏంటా చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: