* కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య సమన్వయలోపం ప్రధాన కారణమా..?
* కేంద్రానికి జై కొట్టే పార్టీకే నిధులు అనేలా...!
* రాష్ట్రంలో ప్రధాన సమస్యలు తీరడానికి అదొక్కటే మార్గమా...?

(ఉమ్మడి ఏపీ-ఇండియా హెరాల్డ్): 2014 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో అప్పట్లో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోయింది. దాంతో ఆంధ్రప్రజలు  2014 లోక్సభ ఎన్నికలలో అధికార  కాంగ్రెస్ ఓటమిలో భాగంమయ్యారు. 2014 లోక్సభ ఎన్నికల్లో బిజెపి ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని సాధించుకుని అధికారం చేపట్టింది. అదే సమయంలో 2014లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ అధికారం చేపట్టారు. ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఓడించేందుకు టిడిపి జనసేన బిజెపి తో కలిసి కూటమిగా ఏర్పడి 2014 ఎన్నికల్లో విజయం సాధించి టిడిపి అధికారంలోకి వచ్చింది.2014లో కేంద్రంలో ఎన్దియే ప్రభుత్వం అధికారం చేపట్టిన సమయంలో తెలంగాణలో టిఆర్ఎస్ అధికారం లోకి వచ్చింది.  అయితే సీఎం కేసీఆర్ ముందుచూపుతో కేంద్ర మద్దతు లేకపోయినప్పటికీ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేశారు.కానీ 2109లో రెండవసారి అధికారం చేపట్టిన కేసీఆర్కు మరలా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో ఆర్థికంగా నిధులను కేంద్రం నుంచి తెప్పించుకోవడంలో విఫలమయ్యారు.రాష్ట్రంలో ఆర్థిక సమస్య వల్ల కొన్ని వర్గాలకు న్యాయం చేయడంలో కెసిఆర్ ఫెయిల్ అవ్వడంతో 2024 లోకెసిఆర్ ఓటమికి ప్రధాన కారణమైంది.  అయితే  గత పదేళ్లలో కెసిఆర్ చేసిన తప్పులు,కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోలేకపోవడంపై, రాష్ట్ర అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేయడంతో 2024 ఎన్నికల్లో తెరాస ప్రభుత్వం ఓటమి చవి చూసింది. దాంతో భారీ మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధించి సీఎం గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అయితే 2024 ఎన్నికలలో కూడా మరలా కేంద్రంలో ఎన్దియే ప్రభుత్వం రావడంతో  రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్థికపరంగా తీవ్ర తలనొప్పిగా మారింది. అయితే రాష్ట్రంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం బడ్జెట్లో భారీ మొత్తంగా కేటాయింపులు చేయాల్సి ఉంది. అయితే ఆ పథకాలన్నీ అమలు కోసం రాష్ట్ర బడ్జెట్ పై భారం పడడంతో  కేంద్రం సహాయం కోసం కోరినప్పటికీ కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఉండడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య సఖ్యత లేకపోవడం ప్రధాన కారణం అయ్యింది.

అలాగే రాష్ట్ర విభజన తర్వాత 2014 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమితో ఏర్పడిన టిడిపికి, బిజెపికి,జనసేనకి మధ్య సఖ్యత కుదరకపోవడంతో కూటమి నుంచి బిజెపి, జనసేన బయటకు వచ్చేసాయి. దాంతో అధికారంలో ఉన్న టిడిపికి మాత్రం కేంద్రం నుంచి ఏమాత్రం సహాయం అందలేదు.దాంతో రాష్ట్ర అభివృద్ధి అనేది ముందుకి సాగక ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా అంటూ అధికారంలోకి వచ్చిన టిడిపికి ఇబ్బందిగా మారింది.  ప్రజలకు విశ్వాసం కోల్పోయింది. అయితే 2019 ఎన్నికల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర సంచలన విజయం సాధించడంతో ఒకవైపు కూటమిలో భాగంగా వచ్చిన టిడిపి,జనసేన బిజెపిల కలయికని ప్రజలు ఆమోదం ఉంచకపోవడంతో వైసిపి పార్టీ 2019 ఎన్నికల్లో భారీగా మెజారిటీ సాధించే అధికారాన్ని చేపట్టింది. అయితే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు  పార్టీ అధికారంలో ఉండడంతో జగన్కు చెప్పుకోదగ్గ విధంగా కేంద్రం నుంచి నిధులు రాలేదు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఆ ఐదేళ్ల పరిపాలనలో జగన్ సంక్షేమ పథకాల కోసం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టారు దాంతో రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా పాతాళానికి పోయినట్టు అనిపించింది. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా వచ్చిన కూటమి ప్రభుత్వం  ప్రస్తుతం 2024 ఎన్నికల్లో భారీ విజయాన్ని చేజెక్కించుకుంది. అయితే ప్రస్తుతం కేంద్రంలో కూటమి మిత్రపక్షం అయినటువంటి ఎన్డీఏ ఉండడంతో ఎలాగైనా సరే నిధులు సమకూర్చే విషయంలో ఈసారి సీఎం చంద్రబాబు వ్యూహాత్మక ఆలోచనలు చేసే దిశలో ఉన్నట్లు సమాచారం. అయితే వీరి మధ్య సఖ్యత ఈ ఐదేళ్లు ఇలానే కొనసాగుతుందా అనే ఒక భయం రాష్ట్ర ప్రజల్లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: