గత పదేళ్ల  నుంచి వైసీపీ పార్టీ కోసం కష్టపడుతూ ఆర్థికంగా నష్టపోయినటువంటి కార్యకర్తలకు నాయకులను సైతం గుర్తించిన వైసీపీ పార్టీ వారికి అండగా నిలవాలని ఇటీవల కాలంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా పార్టీలో ముఖ్యులైన ఒకరిద్దరి నాయకులతో కూడా చర్చిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో పార్టీని కాపాడుకునేందుకు సైతం గ్రామీణ ప్రాంతాలలోని నాయకులు కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారని.. కానీ 2019లో జగన్ సీఎం చేసుకుంటే కష్టాలన్నీ తీరిపోతాయని నమ్మకంతో ఉండేవారు.


అయితే వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కష్టాలు పోలేదని దీంతో చిన్న చిన్న కాంట్రాక్టులు చేసి ప్రభుత్వం నుంచి బిల్లులు రాక చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే కాకుండా చాలానే వైసీపీ నేతలు కార్యకర్తలు ఇబ్బందులు పడడంతో 2024 ఎన్నికలలో వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయిందని తెలుస్తోంది. అయితే ఐదేళ్లు అధికారం ఉన్నప్పుడు కనీసం జగన్ పలకరింపుకు కూడా నోచుకోని నాయకులు చాలా మంది ఉన్నారని ఇటీవలే తెలియజేస్తూ ఉన్నారు. ఇల్లంతా కూడా వైసిపి పార్టీకి వ్యతిరేకంగానే పనిచేశారని రూమర్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి.


కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ శ్రేణుడు నష్టపోతున్నారు కొంత మందిని సైతం కచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఇప్పుడు జగన్ దృష్టికి చాలామంది నేతలు తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు సానుకూలంగానే జగన్ కూడా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ విషయం  గురించి జగన్ స్వయంగానే త్వరలోనే ప్రకటించే విధంగా అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం ఒకవేళ నిజమైతే కచ్చితంగా కార్యకర్తలు వైసీపీ శ్రేణులకు ఇదొక గుడ్ న్యూస్ వంటిదని చెప్పవచ్చు. ఇటీవల విశాఖ ఎమ్మెల్సీ గెలుపు విషయం పైన కూడా అటు కార్యకర్తలు నేతలు కాస్త ఆనందంగా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: