స్టార్ హీరో బాలకృష్ణ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించడం ద్వారా వార్తల్లో నిలిచారు. బాలయ్య స్వయంగా స్టీరింగ్ పట్టి బస్సును కొంత దూరం నడిపి అభిమానుల్లో జోష్ నింపారు. బస్సు డ్రైవింగ్ చేసిన బాలయ్యను చూసి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బాలయ్య కేవలం రీల్ లైఫ్ హీరో మాత్రమే కాదని రియల్ లైఫ్ హీరో కూడా అని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బాలయ్య అనుకుంటే ఏ పనినైనా సులువుగా పూర్తి చేస్తారని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తన సినిమాలలో యాక్షన్ సన్నివేశాలను డూప్ తో తెరకెక్కించడానికి కూడా బాలయ్య ఇష్టపడరని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది. సినిమాల్లో హ్యాట్రిక్ సాధించిన బాలయ్య దర్శకుడు బాబి సినిమాతో డబల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టడం పక్కా అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
సీనియర్ స్టార్ హీరోలలో బాలయ్య రూటే సపరేట్ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. బస్సే కాదు ఈ వాహనాన్నైనా బాలయ్య అలవోకగా నడపగలరని అభిమానుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య వయసు 62 సంవత్సరాలు అంటే నమ్మశక్యం కాదని మరికొందరు అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం 34 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్న బాలయ్య రాబోయే రోజుల్లో 50 కోట్ల రూపాయలు రేంజ్ లో పారితోషకం అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.