స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ సినిమాలు, రాజకీయాలు అనే తేడాల్లేకుండా రెండు రంగాల్లో సత్తా చాటి ప్రశంసలు అందుకున్న హీరోలలో ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే బాలయ్య రాజకీయాల్లో హ్యాట్రిక్ సాధించడానికి ఒక విధంగా ఆయనకు సినీ రంగంలో ఉన్న గుర్తింపే కారణమని చెప్పవచ్చు. సీనియర్ స్టార్ హీరోలలో చిరంజీవి నంబర్ వన్ స్థానంలో ఉండగా బాలయ్య నంబర్ 2 స్థానంలో ఉన్నారు.
 
ఈ ఇద్దరు హీరోలు ఒకరిని మించి మరొకరు సినిమాల్లో సక్సెస్ సాధించారు. అయితే చిరంజీవి సినిమాల్లో సక్సెస్ సాధించి రాజకీయాల్లో సక్సెస్ సాధించలేకపోయారు. బాలయ్య మాత్రం రెండు రంగాలలో అలవోకగా లక్ష్యాలను సాధించారనే చెప్పాలి. బాలయ్య సినిమాల్లో సీమ సింహం అని రాజకీయాల్లో సైతం సీమ సింహం అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
బాలయ్యకు మంత్రి పదవి దక్కలేదని అభిమానుల్లో బాధ ఉన్నా బాలయ్య కావాలని అనుకుంటే మంత్రి పదవి సులువుగా దక్కుతుందని సినిమాల్లో బిజీగా ఉండటంతో బాలయ్య ఆ పదవిపై పెద్దగా ఆసక్తి అయితే చూపడం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రెండున్నర సంవత్సరాల తర్వాత కూటమి సర్కార్ మార్పులు చేస్తే ఆ సమయంలో బాలయ్యకు మంత్రి పదవి దక్కుతుందేమో చూడాలి.
 
మరోవైపు సినిమాలకు సంబంధించి బాలయ్య ఏ సినిమాలో నటించినా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తోంది. బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అవుతుండగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథాంశాలపై బాలయ్య దృష్టి పెడుతున్నారు. బాలయ్య రాజకీయాలు, సినిమాల్లో మరిన్ని సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా అభిమానుల ఆకాంక్షలు నెరవేరుతాయేమో చూడాల్సి ఉంది. బాలయ్య దాదాపుగా 35 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం కొసమెరుపు. బాలయ్య నటుడిగా తన రేంజ్ ను మరింత పెంచుకుంటే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: