* మెగాస్టార్ రాజకీయ ఎంట్రీ అప్పట్లో ఒక సంచలనం.!
* ప్రజాసేవలో భాగంగా రాజకీయాల్లో దిగిన మెగాస్టార్..!
* రాజకీయాలు వేరు.. సినిమా వేరని గ్రహించేనా.?
* మెగాస్టార్ ఎగ్జిట్ కూడా ఒక సంచలనమే.!

(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్-ఇండియాహెరాల్డ్ ): తెలుగు రాష్ట్ర రాజకీయాలకి తెలుగు చిత్ర పరిశ్రమకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని అందరికీ తెలిసిన సంగతే. తెలుగు చిత్ర పరిశ్రమ నుండి మొదటిసారి నందమూరి తారక రామారావు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. సినీ ఇండస్ట్రీలో ఎన్టి రామారావు తర్వాత అంత పెద్ద క్రేజీ తెచ్చుకున్న స్టార్ హీరో ఎవరైనా ఉంటే ఉన్నారు అంటే మొదట గుర్తుచేది మెగాస్టార్ చిరంజీవి.ఆయన అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్ 150కి పైగా సినిమాలు తీసి ప్రస్తుతానికి ఇండస్ట్రీకే  పెద్దదిక్కుగా ఉన్నారు.ఆయన తీసిన సినిమాల్లో ఎక్కువభాగం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలు. 39 ఏళ్ళకు పైబడ్డ నట ప్రస్థానంలో మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, రఘుపతి వెంకయ్య బహుమతి, తొమ్మిది ఫిల్మ్ ఫేర్ సౌత్ బహుమతులు గెలుచుకున్నాడు.2006 లో చిరంజీవికి చలన చిత్ర రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ బహుమతి, 2024లో పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. అదే సంవత్సరం ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ఇచ్చింది.ఆయన కేంద్ర ప్రభుత్వంలో 2012 ఆగస్టు 27 నుంచి 2014 మే 26 దాకా పర్యాటక శాఖా మంత్రిగా పనిచేశాడు.సినీ ఇండస్ట్రీలో ఉంటూనే ఆయన ఎన్నో రకాల సేవలు బ్లడ్ బ్యాంక్, నేత్రదానాలా ద్వారా పేద ప్రజలకు అందించారు.

అలాగే 2008 లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయ సేవ కూడా అందించాలనే లక్ష్యంతో రాజకీయాల్లో అడుగు పెట్టారు.ప్రజారాజ్యం పార్టీ స్థాపనతో చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించారు. తిరుగులేని హీరోగా దశాబ్దాలుగా శాసించి.. అత్యంత ప్రజాదరణ ఉన్న హీరో.. ప్రజల్లో బలమైన ముద్ర వేసిన వ్యక్తి.. రాజకీయాల్లోకీ వస్తే ఎలా ఉంటుందో చూపారు. 'చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చేశారు' పరిస్థితేంటి..? అనే అంతర్మధనాలు ఎక్కువయ్యాయి. తిరుపతిలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభకు వచ్చినంత జనం నేటికీ మరే పార్టీ ఆవిర్భావ సభకు రాలేదన్నది నిజం. తెరపై ప్రజలను అలరించిన ఆయనే.. నేతగా ఊరూరా ఎండల్లో తిరిగారు. ప్రజలకు తానేం చేయగలనో వివరించారు. ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలొచ్చినా.. మరే కొత్త పార్టీ సాధించనన్ని రికార్డులూ రాజకీయాల్లోనూ నెలకొల్పారు.అనేకానేక పరిస్థితుల దృష్ట్యా పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.అప్పటికే రాజకీయ దిగ్గజాలు అయినటువంటి చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలతో తలపడి వారికీ ఎదురెళ్లడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదని తెలిసినా కూడా చిరంజీవి రిస్క్ చేశారు. 2009 ఆంధ్రప్రదేశ్అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగి భారీగా ఓటమి చవి చూసారు. కేవలం 18 అసెంబ్లీ స్థానాల్లోనే విజయం సాధించిన చిరంజీవి తర్వాతి రోజుల్లో పార్టీని నడపటం సులువు కాదని గ్రహించి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా తన పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసి తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు.తర్వాత రాజకీయాలు వేరు... సినిమా ప్రపంచం వేరు.. అనేలా మెగాస్టార్ మరల కంబ్యాక్ అంటూ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ తాను నమ్ముకున్న కళామ్మ తల్లీ ఒడిలో హ్యాపీగా లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయం సరైన కాదని 2014 లేదా 2019లో చిరంజీవి పాలిటిక్స్ లోకి వచ్చి ఉంటే కచ్చితంగా సంచలన ఫలితాలు సొంతమయ్యే అవకాశం ఉండేదని చాలామంది భావిస్తారు. ఇతరులను ఘాటుగా, బాధ పెట్టేలా విమర్శలు చేసే గుణం లేకపోవడం రాజకీయాల్లో చిరంజీవికి మైనస్ అయిందని మరి కొందరు భావిస్తారు. అయితే చిరంజీవి రాజకీయాల్లో సాధించిన విజయాలు సైతం తక్కువేం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: