•సినిమాలే కాదు రాజకీయాలలో కూడా మేటి
•ఓడిన తిరిగి గెలిచిన యోధుడు
•సినిమాలలోనే కాదు రాజకీయాల్లో కూడా సక్సెస్ అయిన మురళీమోహన్..


(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ )


మురళీమోహన్.. ఈయన అసలు పేరు మాగంటి రాజబాబు. 1940 జూన్ 24న పశ్చిమగోదావరి జిల్లాలోని చాటపర్రు గ్రామంలో జన్మించిన ఈయన, తన  విద్యాభ్యాసం ఏలూరులో పూర్తి చేశారు. ఈయన తండ్రి మాగంటి మాధవరావు స్వాతంత్ర్య సమరయోధుడు. మురళీమోహన్ విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత 1963 లో ఎలక్ట్రికల్ మోటార్ , ఆయిల్ ఇంజన్ వ్యాపారం ప్రారంభించి,  ఆ తర్వాత విజయవాడలో నాటకాలలో నటించడం మొదలుపెట్టారు.

సినిమాల్లోకి రావాలనుకున్న ఈయన అలా 1973లో అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన జగమే మాయ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. కానీ 1974లో దాసరి నారాయణరావు తీసిన తిరుపతి సినిమాతోనే  ఈయనకు గుర్తింపు వచ్చింది .అలా తెలుగులో 350 కి పైగా చిత్రాలలో నటించిన ఈయన తన సోదరుడు కిషోర్ తో కలిసి జయభేరి ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను కూడా స్థాపించి దాదాపు 25 చిత్రాలను నిర్మించారు. అంతేకాదు నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్,  ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లలో వివిధ హోదాలలో సేవలు అందించి 2017 వరకు తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి గౌరవ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు.


అటు వ్యాపార రంగంలో కూడా సక్సెస్ చూసిన ఈయన సినిమాలలో భారీ సక్సెస్ అందుకున్న తర్వాత ఆ రాజకీయరంగ ప్రవేశం చేశారు. 2009లో జరిగిన 15వ లోక్సభ ఎన్నికలలో రాజమండ్రి లోకసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలిచిన ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండవల్లి అరుణకుమార్ చేతిలో కేవలం రెండువేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.తిరిగి 2014 ,16వ లోక్సభ ఎన్నికలలో గెలిచి రాజమండ్రి పార్లమెంటు సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజకీయాలలో చక్రం తిప్పిన ఈయన ప్రస్తుతం అటు సినిమాలకు దూరంగా ఇటు రాజకీయాలకు దూరంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. సంపాదించిన డబ్బును భూములపై ఇన్వెస్ట్ చేయాలని ఆలోచన శోభన్ బాబు నుండి పొంది ప్రస్తుతం వేలకోట్ల ఆస్తులకు అధిపతి అయినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: