ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఈ మధ్య మళ్లీ హాట్ టాపిక్ గా మారుతున్నాయి.గతంలో వైసిపి పాలనలో టిడిపి నేతలు సైతం ప్రతిపక్షంగా ఉన్నది. ముఖ్యంగా గత ఐదేళ్లలో వైసిపి మంత్రులుగా కొడాలి నాని, జోగి రమేష్ వల్లభనేని వంశీ వంటి వారు గతంలో టిడిపి నేతలను టార్గెట్ చేయగా.. ఇప్పుడు కూటమి నేతలు వైసిపి నేతలను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా మహిళా మంత్రి రోజా చుట్టూ కూడా ఉచ్చు బిగిసుకుంటోందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఇమే క్రీడా శాఖ మంత్రిగా కూడా వ్యవహరించింది.


ఆ సమయంలోనే క్రీడాకారులను ప్రతిభను వెలుగు లోకి తీసుకురావడానికి రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు వైసీపి ప్రభుత్వం. ఇందులో భారీగానే అవినీతి జరిగిందని ఆరోపణలు అయితే ఇప్పుడు వినిపిస్తున్నాయి. అంతకుముందే సీఎం కప్పు పేరిట కూడా క్రీడా పోటీలు నిర్వహించగా అందులో కూడా అవకతవకులు జరిగాయని ఆరోపణలు కూడా ఎక్కువగా వినిపించాయి. ఇలా క్రీడా మంత్రులుగా పనిచేసిన రోజా, ధర్మాన కృష్ణ దాస్  వంటి మంత్రులు కూడా కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని ఆంధ్రప్రదేశ్ సిఐడి కి ఫిర్యాదులు చేయడం జరిగింది మాజీ కబడ్డీ ప్లేయర్ RD ప్రసాద్.


దీంతో సిఐడి ఉన్నతాధికారులతో విచారణ చేపట్టాలి అంటూ అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని కూడా పోలీస్ కమిషనర్ను సిఐడి ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటికే ఆడుదాం  ఆంధ్ర అనే పేరుతో జరిగిన అక్రమాలు అవినీతిని బయటపెడతామంటూ క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. గడిచిన ఐదేళ్లలో క్రీడా శాఖలో జరిగినటువంటి అవకతవకల పైన కూటమి ప్రభుత్వం సీరియస్ గా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఇందులో ఎవరెవరు పేర్లు బయటికి వస్తాయో చూడాలి మరి. ఏదేమైనా కూటమి నేతలు వైసిపి నేతలను టార్గెట్ చేశారని చాలా క్లియర్ గా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: