ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు చెప్పిన మాటలను కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. ముఖ్యంగా తన మాటలలో చాలా మార్పు వచ్చిందని కూడా చెప్పవచ్చు.. గతంలో ఇచ్చిన మాట తప్పుతారు చంద్రబాబు అనే మాటని ఇప్పుడు మార్చేశారు. అందుకు ఉదాహరణగా తాజాగా గుడివాడ పర్యటనలో భాగంగా ఒక ఆటో డ్రైవర్తో సైతం ముచ్చటించారు. చంద్రబాబు ఆయన కష్టాలను కూడా తెలుసుకొని అవి తీరాలంటే ఏం చేయాలి అని కూడా అడిగారట.


అయితే ఆటో డ్రైవర్ చెప్పిన విషయాన్ని విని ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది.. అయితే రాజకీయ నాయకులు అంటే హామీలు ఇవ్వడమే తప్ప నెరవేర్చరని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ చంద్రబాబు ఆటో డ్రైవర్ ని కూడా వదలకుండా హామీని సైతం నిలబెట్టినట్లుగా తెలుస్తోంది. కృష్ణ జిల్లాలోని గుడివాడలో రామబ్రహ్మం పార్కుల అన్న క్యాంటీన్ ని రెండు రోజుల క్రితం ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఒక ఆటో డ్రైవర్ రేమల్లి రజనీకాంత్ తో చంద్రబాబు మాట్లాడడం జరిగింది.


ఆటో నడుపుతూ తన ఇద్దరు పిల్లలను ఉన్నత విద్యను చదివిస్తున్నానని తెలియజేశారు. తన కొడుకు రవితేజ ఇంగ్లీషులో మాట్లాడుతూ తాను ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నానని తన చెల్లి బిడియస్ చదువుకు అడ్డంగా ఉన్నదంటు తెలిపారట. ఇలాంటి సమయంలో చంద్రబాబు రజనీకాంత్ కు సైతం ఒక హామీ ఇచ్చారట. తన ఆటోను విద్యుత్ వర్షన్ లో మార్చుకో అని అందుకు ఎంత ఖర్చు అవుతుందని అడగగా నాలుగు లక్షల వరకు అవుతుందన్నారట.. కానీ సాధారణ ఆటోను విద్యుత్ ఆటోగా మార్చే అవకాశాలు లేవని తెలియడంతో.. వెంటనే రజినీకాంత్ కు నాలుగు లక్షల రూపాయల ఆటోని కొనివ్వాలంటూ చంద్రబాబు ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో అలా జారీ చేసిన 48 గంటలలోనే కొత్త విద్యుత్ ఆటోను అధికారులు అందించారు. దీంతో చాలామంది నేతలు కార్యకర్తలు కూడా 2024 ఎన్నికలలో చంద్రబాబు చాలా మారిపోయారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: