- ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ) .

సాధారణ ఎన్నికలలో గోరవాటమి తర్వాత వైసీపీకి ఆంధ్రప్రదేశ్లో వరుస‌ పెట్టి ఎదురు షాక్ లు తగులుతున్నాయి. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రిందటే మాజీమంత్రి .. మాజీ ఉప ముఖ్యమంత్రి ... ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడుగా ఉన్న ఆళ్ల నాని పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఓటమి అనంతరం ఈరోజు తొలిసారి మీడియా ముందుకు వచ్చిన ఆళ్ళ నాని వైసీపీలో ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన కొద్ది రోజుల క్రితమే ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి పదవికి రాజీనామా చేస్తూ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.


ఈ క్రమంలోనే ఈరోజు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు మీడియా ముఖంగా ప్రకటించారు . వ్యక్తిగత కారణాలతో వ్యక్తిగత బాధ్యతలతో ఈరోజు పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు ఆళ్ల నాని ప్రకటించారు. తాను కొంతకాలం ప్రత్యక్ష రాజకీయాల కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని .. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు . ఇక భవిష్యత్తు కార్య చరణ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండేందుకు నిశ్చయించుకున్నట్టు ఆళ్ళ నాని ప్రకటించారు.


ఇదిలా ఉంటే ఆళ్ల నాని త్వరలోనే జనసేనలో చేరేందుకు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ టిడిపి నుంచి బడేటి చంటి ఎమ్మెల్యే గా ఉన్నారు. ఈ క్రమంలోనే టిడిపిలోకి వెళ్ళటం కన్నా మాజీ ఉప ముఖ్యమంత్రి హోదాలో ... పైగా కాపు సామాజిక వర్గాన్ని అడ్డంపెట్టుకుని జనసేనలోకి వెళ్లి అక్కడ రాజకీయం చేయాలని నాని ప్రణాళికగా తెలుస్తోంది. అయితే అక్కడ నానిని టిడిపి - జనసేన లో చేర్చుకునేందుకు స్థానిక పార్టీ నేతలు నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: