అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ తగ్గడానికి డ్రాగన్ దేశం కుట్రలు పన్నిందనే విషయాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో భాగంగానే ఎన్నికలకు ముందు రిజర్వేషన్ల అంశం, ఎస్సీ వర్గీకరణ, అగ్నివీర్ పై ఆందోళనలు.. రైతు ఉద్యమాలు ఇవన్నీ చైనా ప్రోత్సాహంతోనే జరిగినట్లు తెలుస్తోంది. అయినా సరే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే పాలన చేపట్టడంతో డ్రాగన్ దేశం ఇప్పుడు ప్లాన్ మార్చింది.
తాజాగా ఏపీలోని అధికార టీడీపీని అడ్డం పెట్టుకొని కేంద్రాన్ని కూల్చాలని చైనా కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జరగబోయే పరిణామాలను పసిగట్టిన అమిత్ షా ముందుగానే కర్ణాటకలో జేడీఎస్ తో, ఏపీలో టీడీపీతో సడెన్ గా పొత్తు పెట్టుకున్నారు. రెండు పార్టీలను ఎన్డీయేలో చేర్చుకొని వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
అయినా కానీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బలం తగ్గిపోయింది. 2014లో 283 సీట్లు, 2019లో 303 సీట్లు సాధించిన బీజేపీ 2024 కి వచ్చే సరికి 234 దగ్గరే ఆగిపోయింది. దీంతో బిహార్ లోని జేడీయూ.. ఏపీలోని టీడీపీ మద్దతు అనివార్యం అయింది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ తరహాలోనే భారత్ లో మోదీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు రష్యా అధికారిక పత్రిక స్పుత్నిక్ సంస్థ చేసిన ఓ పోస్టు ఇప్పుడు సంచలనం రేపుతోంది. దీని ప్రకారం అమెరికా సీఐఏ సంస్థ చంద్రబాబును ఎన్డీయే నుంచి బయటకు తీసుకురావాలని ఒత్తిడి చేస్తోంది. దీంతో పాటు దేశంలో అల్లర్లు సృష్టించి రేపు జరగబోయే హరియాణా, జమ్మూ కశ్మీర్ , మహా రాష్ట్ర ఎన్నికల్లో ప్రభావితం చేయాలని వారి ఆలోచనగా తెలుస్తోంది. దేశంలో అశాంతి సృష్టించడం ద్వారా ప్రభుత్వం విఫలమైందనే భావన ప్రజల్లో బలంగా తీసుకురావొచ్చే అనేది వారి వ్యూహంగా తెలుస్తోంది.