* షర్మిల పెళ్ళికి ఒప్పుకోని వైయస్సార్.!
* షర్మిల-అనిల్ ప్రేమకు బీజం పడింది అక్కడే.!

(ఆంధ్రప్రదేశ్-ఇండియాహెరాల్డ్ ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిగా వచ్చిన టిడిపి జనసేన బిజెపి భారీ విజయాన్ని దక్కించుకొని అధికారం చేపట్టింది. గతఅధికార పార్టీ అయినా వైసీపీను పాతాళానికి తొక్కేసి మరి భారీ విజయాన్ని అందుకుంది. అయితే కూటమి అధికారంలో రావడానికి,జగన్ ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ వాటిలో ముఖ్యంగా జగన్ సోదరీ షర్మిల ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి జగన్ పై తీవ్ర విమర్శలు చేయడం కూడా ఒక ప్రధాన కారణం అయింది.వైయస్సారు కాంగ్రెసు అధ్యక్షుడు అయిన జగన్‌మోహన్‌రెడ్డిని గతంలో అక్రమఆస్తులను కలిగివున్నాడనే ఆరోపణమేరకు సి.బి.ఐ.వాళ్లు అయనను ఉపఎన్నికలముందే అరెస్టు చేసారు.ఈ నేపథ్యంలో పార్టిని మరింత ప్రజలకు చేరువగా తీసుకెళ్లి ప్రయత్నంగా, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపి బలోపేతంచేయు దిశగా మరో ప్రజా ప్రస్థాపన పేరు మీద పాదయాత్ర చేపట్టారు.ఆ పార్టీ అధ్యక్షుడైన అన్న జగన్మోహన్ రెడ్డి తరపున ప్రచార బాధ్యతలను తను తీసుకుని ప్రజలకు మరింత చేరువయింది.తర్వాత కుటుంబంలో వచ్చిన కొన్ని అంతర్గత కలహాల వల్ల సోదరుడు ఐనా జగన్ పై రాజకీయ విమర్శలు చేయడం ప్రారంభించారు.దాంట్లో భాగంగానే ఏపీలోని రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి తండ్రి వైయస్సార్ పార్టీ అయినా కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుండి ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా టీడీపీ కంటే ఎక్కువగా జగన్ పై విమర్శలు చేసి జగన్ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ఓటమికి కారణం అయ్యారు.

అయితే షర్మిల వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆమెకు తన మేనమామ అయినా ప్రతాప్ రెడ్డితో వివాహం జరిగింది.కానీ వారి బంధం ఎక్కువ కాలం నిలవలేదు.తర్వాత షర్మిలారెడ్డి అనిల్ కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక అబ్బాయి మరియు ఒక అమ్మాయి.అయితే షర్మిల-అనిల్ వివాహం అనేది షర్మిల తండ్రి దివంగత నేత వైయస్సార్ ఒప్పుకోలేదు వారిది బ్రాహ్మణ కులం అని వారి కుటుంబ అలవాట్లు మన కుటుంబ అలవాట్లు వేరని నువ్ అక్కడ ఇమడ లేవని వైయస్సార్ వారి పెళ్ళికి అందరి తండ్రులు లాగానే అడ్డుకట్ట వేశారు. స్వాతహాగా నాన్ వెజ్ అంటే షర్మిలకు ఇష్టమంటా కానీ అనిల్ వాళ్ళది బ్రాహ్మణ కుటుంబం కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ వాటికీ దూరంగా ఉంటుందని పెళ్లి అంటే అన్నీ విధాలుగా ఆచారాలు-సంప్రదాయాలు కలవాలని నాన్న అన్నారు కానీ చివరికి షర్మిల పట్టు బట్టడంతో చివరికి ఆమె తండ్రి వారి పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు.అయితే షర్మిల అనిల్ మొదటిసారి ఒక దాబాలో కలిసారని మొదట అనిల్ షర్మిలను చూసి పరిచయం పెంచుకున్నారని ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి చివరికి పెళ్లి దాక వెళ్లిందని షర్మిల ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో చెప్పారు షర్మిలకు కూడా అనిల్ తో జరిగిన వివాహం ఇద్దరికీ కూడా రెండో వివాహమే.ప్రస్తుతం షర్మిల-అనిల్ వైవహిక జీవితం హ్యాపీగా సాగుతుంది అలాగే షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహం కూడా ఇటీవల జరిగిన సంగతి తెల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: