ఏపీ రాజకీయాల్లో విడదల రజిని పేరు ఒకింత సంచలనం అనే సంగతి తెలిసిందే. చిన్న వయస్సులోనే మంత్రి పదవి చేపట్టి ప్రశంసలు అందుకున్న విడదల రజిని 2024 ఎన్నికల్లో మాత్రం ఓటమిపాలయ్యారు. ప్రత్తిపాటి పుల్లారావు శిష్యురాలిగా తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చిన విడదల రజిని విఆర్ ఫౌండేషన్ స్థాపించి ఆ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహించి మంచి పేరును సంపాదించుకున్నారు.
 
ఒకప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసిన విడదల రజినికి సోషల్ మీడియాలో సైతం ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. రాజకీయాల గురించి నామమాత్రపు అవగాహన ఉన్నవాళ్లకు సైతం విడదల రజినికి అవగాహన ఉంది. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సమయంలో విడదల రజినికి కుమారస్వామి పరిచయం అయ్యారు. కుమారస్వామి అమెరికాలో పేరు పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలలో ఒకరు కాగా ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
 
విడదల రజిని తీసుకునే ప్రతి నిర్ణయానికి భర్త కుమారస్వామి నుంచి పూర్తిస్థాయిలో సపోర్ట్ లభిస్తుండటం గమనార్హం. విడదల రజిని కుమారస్వామి జీవితంలోకి వచ్చిన తర్వాత కుమారస్వామికి కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో కలిసొచ్చిందని సమాచారం అందుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపురం గ్రామం విడదల రజిని తల్లీదండ్రుల స్వగ్రామం.
 
40 సంవత్సరాల క్రితం విడదల రజిని హైదరాబాద్ హైదరాబాద్ కు వలస వెళ్లారు. తెలంగాణ వ్యక్తులు ఏపీ రాజకీయాల్లో ఉండటం విచిత్రం కాకపోయినా ఎమ్మెల్యేగా, మంత్రిగా గెలవడం అంటే మాత్రం సాధారణమైన విషయం కాదని చెప్పవచ్చు. విడదల రజిని భర్త సొంతూరు చిలకలూరిపేట కాగా ఆమె 2019 ఎన్నికల్లో అక్కడినుంచి పోటీ చేసి రాజకీయాల్లో సత్తా చాటారు. విడదల రజిని, కుమారస్వామి క్యూట్ కపుల్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. విడదల రజిని సక్సెస్ స్టోరీ ఎంతోమందిలో స్పూర్తి నింపుతుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.




మరింత సమాచారం తెలుసుకోండి: