•ఎంటెక్ చదువుతున్నప్పుడే ప్రేమ మొదలు..
•ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన జంట..
(ఆంధ్రప్రదేశ్ -ఇండియా హెరాల్డ్)
ఆంధ్రప్రదేశ్ నుండి సింగనమల నియోజకవర్గానికి శాసనసభ సభ్యురాలిగా పనిచేసిన ప్రముఖ భారతీయ రాజకీయ నాయకురాలు జొన్నలగడ్డ పద్మావతి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకున్న ఈమె 2014 ఎన్నికలలో ఓటమిపాలయ్యింది. అయితే ఎలాగైనా సరే అధికారంలోకి రావాలనుకున్న పద్మావతి ఊహించిన విధంగా ప్రజల్లోకి వెళ్లి పాదయాత్ర చేపడుతూ గడపగడపకూ తాము అధికారంలోకి వస్తే ఎలా అభివృద్ధి జరుగుతుంది అనే విషయాలను ప్రజలకు తెలియజేసింది. అన్నట్టుగానే 2019 ఎన్నికలలో భారీ మెజారిటీ సాధించి విజయాన్ని సొంతం చేసుకుంది.
రాజకీయాలలో చెరగని ముద్ర వేసుకున్న ఈమె ఆలూరు సాంబశివారెడ్డిని ప్రేమించి మరీ వివాహం చేసుకుంది .అనంతపురం జెఎన్టియు కళాశాలలో ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చదివే సమయంలో ఆలూరు సాంబశివారెడ్డి తో పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది..అంతేకాదు సాంబశివారెడ్డికి ఆర్థికంగా కూడా సహాయపడింది పద్మావతి. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు తమ ప్రేమను తెలియజేసి అందరి సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇక పద్మావతిని సాంబశివారెడ్డి వివాహం చేసుకున్న తర్వాత ఈ జంటకు అటు విద్యాసంస్థల పరంగా ఇటు రాజకీయంగా బాగా కలిసి వచ్చిందని చెప్పాలి.
ప్రస్తుతం అనంతపురంలో రోటరీ పురం వద్ద ఎస్ఆర్ఐటి విద్యాసంస్థను స్థాపించి కొన్ని వేల మంది విద్యార్థులకు చక్కటి విద్యను అందిస్తున్నారు. ఒకవైపు ఈ విద్యా సంస్థ ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకున్న జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త సాంబశివారెడ్డి రాజకీయాలలో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా ప్రజలకు కావలసిన అన్ని అంశాలపై చర్చించి ప్రభుత్వంతో పోరాడి మరీ ప్రజలకు మంచి చేశారు. భార్యాభర్తలిద్దరూ ఎవరికి వారు ఎక్కువ కాదు అని సమానమే అని సమానత్వాన్ని నిరూపిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది ఈ జంట. ఇక వీరికి ఆలూరు విరాట్ అనే అబ్బాయి కూడా జన్మించారు. ముఖ్యంగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంట ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం జొన్నలగడ్డ పద్మావతి మాజీ ఎమ్మెల్యేగా మారిపోయారు .అయినా సరే ప్రజలకు మంచి చేయాలన్న వారి లక్ష్యం మాత్రం ఆగిపోలేదు. ఎప్పటికప్పుడు కష్టం వచ్చిందని తమ దగ్గరకు వెళ్తే కచ్చితంగా ఆదుకుంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ జంట.