కానీ అధికారం చేపట్టే ఇప్పటికి రెండు నెలలు కావస్తున్న ఈ విషయం పైన సీఎం చంద్రబాబు ఖజానా లేదంటే తెలియజేస్తున్నారు. వాస్తవానికి ఆగస్టు 15 ఫ్రీ బస్ అమలు చేయాలనుకున్నప్పటికీ కొన్ని కారణాల చేత వాయిదా వేశారు. అయితే ఇప్పుడు తాజాగా టిడిపి నేతలు దగ్గర నుంచి వినిపిస్తున్న సమాచారం. ప్రకారం మహిళలకు ఉచిత బస్ స్కీమ్ రాఖీ పండుగ రోజున అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇందుకోసం ఏపీ ప్రభుత్వం కూడా కసరత్తులు చేస్తోందని మంత్రులు అధికారులు కూడా ఈ ఉచిత బస్సు స్కీమ్ పైన త్వరలోనే గుడ్ న్యూస్ మహిళలకు చెప్పబోతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి కచ్చితంగా ఏ రోజున ఈ స్కీమ్ ని అమలు చేస్తారనే విషయం పైన మహిళలు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే రక్షాబంధన్ రోజున ఈ స్కీముని అమలు చేస్తారా లేదా తెలియాల్సి ఉన్నది. కూటమి ప్రభుత్వానికి ఈసారి పరిపాలన కత్తి మీద సాములాగా మారిపోయింది. ముఖ్యంగా మేనిఫెస్టోలో అధిక హామీలను చెప్పడంతో పాటు.. సాధ్యం కానటువంటి హామీలను కూడా అమలు చేస్తామంటూ తెలుపుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.