కూటమిగా జనసేన, టిడిపి, బిజెపి పార్టీలు 2024 ఎన్నికలలో భాగంగా పోటీ చేసినప్పటికీ అప్పటినుంచి అన్ని వాటిలో కూడా ఆయా పార్టీలకు సముచిత స్థానం కల్పిస్తూ ముందుకు వెళుతున్నారు. అయితే ఇందులో కొంతమంది నిరాశతో ఉన్నప్పటికీ యాంగర్స్ కి మాత్రమే ఎక్కువగా ప్రోత్సాహం ఇచ్చేలా చేస్తోంది కూటమి. ఇప్పుడు తాజాగా నామినేటెడ్ పదవులు భర్తీకి రంగం సిద్ధం అయ్యింది. ఇందుకోసం కూటమినేతలు భారీగానే పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా 23 వేల మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.



అయితే ఈ నామినేటెడ్ పోస్టుల పదవుల పంపకాల పైన అటు పవన్ కళ్యాణ్, పురందేశ్వరి, చంద్రబాబు కూడా చర్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దశలవారీగా ఈ పోస్టులను సైతం ప్రకటించాలంటూ తెలియజేశారు. ఇందులో భాగంగా ఎన్నికలలో సీట్లు దక్కని కొంతమంది టీడీపీ సీనియర్లకు ఈ పదవులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో నామినేటెడ్ పదవుల పైన ఇలా కూటమి ఒక ఒప్పందానికి కుదుర్చుకున్నారట. మొదటి దశకు సంబంధించిన ప్రకటనను త్వరలోనే ప్రకటిస్తామని అందుకు సంబంధించి కసరత్తు కూడా పూర్తి అయ్యిందని సమాచారం. ఇందులో టిడిపిలో సీనియర్లతో పాటు జనసేన బిజెపి ముఖ్య నేతలకు సైతం ఈ రాష్ట్ర పదవులు దక్కబోతున్నాయి.


టిడిపిలో ఎంపీ ఎమ్మెల్యే సీట్లు ఆశించి బంగబడిన వారికి ఈ లిస్టులో అవకాశం దక్కుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. దేవినేని ఉమాకు ఆర్టీసీ చైర్మన్, ప్రవీణ్ కుమార్ రెడ్డి కి ఏపీఐసి చైర్మన్, పట్టాభికి పౌరసరఫరాల కార్పొరేషన్, మాజీ మంత్రి పీతల సుజాత కు ఎస్సీ కమిషన్, మాజీ మంత్రి కిరాని శ్రావణ్ కుమార్ కు ఎస్టీ కమిషన్ ఖరారు అయినట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు అమరావతికి సంబంధించి కీలక బాధ్యతలు అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. మెగా బ్రదర్ నాగబాబుకి కూడా ఒక కీలకమైన పదవి దక్కబోతున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: