టిడిపిలో కీలకంగా పులివర్తి కుటుంబం 

 పులివర్తి నాని భార్యగా సుధా రెడ్డికి గుర్తింపు 

 మహిళా కోటలో పులివర్తి సుధా రెడ్డికి కీలక పదవి  


 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నామినేటెడ్ పోస్టుల హడావిడి స్పష్టంగా కనిపిస్తోంది. ఏ క్షణమైన నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయనున్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పటికే దీనిపై పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు  ఫోకస్ చేయడం జరిగింది. నామినేటెడ్ పోస్టుల కోసం దాదాపు 23 వేల దరఖాస్తులు కూడా వచ్చాయని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో జనసేన, తెలుగుదేశం అలాగే భారతీయ జనతా పార్టీల  నేతలకు ఈ పదవులను పంచాల్సి  ఉంటుంది.


 

తెలుగుదేశం పార్టీ నేతలకు దాదాపు 50 నుంచి 60 పోస్టులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అటు జనసేనకు 30 శాతం పోస్టులు ఇవ్వాల్సిందే.  అదే సమయంలో భారతీయ జనతా పార్టీకి 10 శాతం కచ్చితంగా వెళుతుంది. అయితే ఈ లిస్టులో తెలుగుదేశం పార్టీ తరఫున... మహిళ నేత అయిన పులివర్తి సుధా రెడ్డికి కీలక పదవి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ పదవి ఇస్తారా..? లేక ఇంకా ఏదైనా కీలక పదవి ఇస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


 

మొత్తానికైతే.. పులివర్తి నాని  సతీమణి పులివర్తి సుధా రెడ్డికి కచ్చితంగా పదవి వస్తుందని అంటున్నారు. చంద్రబాబు కూడా ఆమెను లిస్టులో ఉంచినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం పులివర్తి కుటుంబం చాలా కష్టపడ్డారు. పులివర్తి నాని అదే సమయంలో ఆయన సతీమణి పులివర్తి సుధా రెడ్డి.. గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం కోసం.. ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. 


 

ఇక చంద్రగిరి నియోజకవర్గ ఎన్నిక సందర్భంగా... వైసిపి నేత చెవిరెడ్డి దాడికి.. పులివర్తి నానికి తీవ్ర గాయాలు అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ కుటుంబానికి మరింత ప్రాధాన్యత పెరిగిందని చెబుతున్నారు. అటు ఈసారి చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని విజయం సాధించారు. ఇక ఎప్పుడూ ఆయన భార్యకు కూడా ఒక పదవి ఇచ్చి పార్టీని కాపాడుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: