ప్రభుత్వాలు మారినప్పుడల్లా కూడా కొన్ని వ్యవస్థలలో సహజంగానే మార్పులు జరుగుతూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశానికి అనుకూలమైనటువంటి వాళ్ళు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో ఉంటే.. వాళ్లందరినీ మళ్లీ రాజీనామా చేసీ ఆ ప్లేస్ ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  సంబంధించినటువంటి బ్యాచ్ హస్త గతం చేసుకుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో నుంచి టిడిపి పార్టీ , భారతీయ జనతా పార్టీ కూటమి వైపుగా వెళ్ళింది.



ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ విజయవాడ కేశినేని శివనాథ్ ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అందుకు  అధికారికంగా ప్రకటన వచ్చే నెల 8వ తేదీన విడుదల కాబోతోంది. క్రీడలలో రాజకీయ జోక్యం ఉండకూడదని మాట చెప్పడానికి బాగున్నప్పటికీ కానీ రాజకీయాలు అంటే క్రీడలలో కూడా ఒక పవర్ఫుల్ పాలిటికల్స్గా మారిపోతున్నాయి. అయితే ఇది ఇప్పటిది కాదు గత కొన్నేళ్లుగా ఇలా జరుగుతూనే ఉందని చెప్పవచ్చు. గత ప్రభుత్వంలో విజయసాయిరెడ్డి సమీప బంధువులైన అరబిందో శరత్ చంద్రారెడ్డి చైర్మన్గా ఉన్నారు. అలాగే ఆయన సోదరుడు రోహిత్ రెడ్డి కూడా ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. వీరితో పాటు ఎస్సార్ గోపీనాథ్ రెడ్డి కూడా కార్యదర్శిగా ఉన్నారట.


ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పైన అన్ని మారిపోయాయి. తాజాగా విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలాగే కార్యదర్శిగా సానా సతీష్ ఎన్నికవ్వగా.. సంయుక్త కార్యదర్శిగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ ఎన్నిక కావడం జరిగింది. కూటమి ప్రభుత్వం రాగానే గత పాలనలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పైన ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కేశినేని చిన్ని ACA హ్యాండ్ డ్రైవర్ చేసుకోవాల్సిందిగా కూటమి ప్రభుత్వం బాధ్యతలు ఇవ్వడంతో శరత్ చంద్ర రెడ్డి స్వచ్ఛందంగా ఆగస్టు 4న రాజీనామా చేసి సమర్పించారు. దీంతో కొత్త కమిటీని వేసి మరి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: