* ఎన్నికల కంటే ముందు టిడిపిలో చేరిన కోటంరెడ్డి
* జగన్ నమ్మినబంటుగా కోటంరెడ్డికి గుర్తింపు
* ఆర్టీసీ చైర్మన్ లేదా ప్రభుత్వ విప్


 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నామినేటెడ్ పదవుల భర్తీపై చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఫోకస్ చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ క్షణమైన ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీకి.. సంబంధించిన అప్డేట్ రావచ్చు. దీంతో ఆశావాహులందరూ ఈ పోస్టుల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇప్పటివరకు ఈ నామినేటెడ్ పోస్టుల కోసం 23 వేల దరఖాస్తులు వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి.

 అయితే తెలుగుదేశం కూటమి ఏపీలో అధికారంలో ఉన్న తరుణంలో... ఈ పోస్టులను మూడు పార్టీలకు పంచాల్సి ఉంటుంది. అంటే ఈ పోస్టుల్లో తెలుగుదేశం పార్టీకి దాదాపు 60 శాతం రాబోతున్నాయి. అలాగే పార్టీ కోసం దాదాపు 5 సంవత్సరాల పాటు చాలామంది ఈ కష్టపడ్డారు. ఇటు పొత్తులో భాగంగా కొంత మంది ఎమ్మెల్యే టికెట్లను కోల్పోవడం కూడా జరిగింది. కొంతమంది త్యాగాలు.. కూడా చేశారు.

వాళ్లందరిని దృష్టిలో పెట్టుకొని ఈ పోస్టులను భర్తీ చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు. అయితే వైసీపీ నుంచి ఎన్నికల కంటే ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి... ఆర్టీసీ చైర్మన్  ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరు నుంచి ఆనం  మంత్రి పదవి దక్కించుకున్నారు.  ఇప్పుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి.. ఆర్టీసీ చైర్మన్ లేదా మరో కీలక పదవి వచ్చే ఛాన్స్ ఉందట.

 నెల్లూరు జిల్లాను సాసించాలంటే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని  మనం గ్రిప్ లో పెట్టుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నారట. అందుకే ఆయన ఎమ్మెల్యేగా గెలిచినా కూడా.... ఏదైనా చైర్మన్ పదవి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారట. ఒకవేళ ఈ నామినేటెడ్ పోస్టులు కాకపోతే ఆయనకు ప్రభుత్వ విప్ ఇచ్చే ఛాన్సులు కూడా పరిశీలిస్తున్నారట చంద్రబాబు నాయుడు.  ఖచ్చితంగా కోటంరెడ్డికి ఎమ్మెల్యే నే కాకుండా మరో కీలక పదవి దక్కుతుందని చెబుతున్నారు ఆయన అనుచరులు.

మరింత సమాచారం తెలుసుకోండి: