- చంద్రబాబు నమ్మిన బంటు.
- పార్టీ కోసం టికెట్ త్యాగం.
- ఉక్కు సంకల్పానికి ఉక్కు లాంటి నామినేటెడ్ పోస్ట్.



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే ఈసారి టిడిపి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం బిజెపి జనసేనతో పొత్తు అని చెప్పవచ్చు. ఈ పొత్తువల్ల టిడిపి నుంచి టికెట్ కోసం ఎదురుచూసిన చాలామంది నేతలు టికెట్లు త్యాగం చేయాల్సి వచ్చింది. అలా త్యాగం చేసిన వారందరిని గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు వారికి ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇవ్వాలని ఆలోచనతో ముందుకు వచ్చారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి. పొద్దుటూరులో టిడిపి గెలవడం కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. చివరికి ఆయనకే టికెట్ వస్తుందని ఆశించారు కానీ చివరి సమయంలో వరదరాజులు రెడ్డికి టికెట్ వెళ్లిపోయింది. ఆయన అక్కడ విజయం సాధించారు. ఆయన విజయంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు. అలాంటి ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఈసారి ప్రభుత్వం నుంచి అద్భుతమైన నామినేటెడ్ పదవి ఇవ్వాలని చంద్రబాబు కసరత్తు మొదలుపెట్టి త్వరలో పేరు కూడా అనౌన్స్ చేయబోతున్నారు. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.

ఉక్కు సంకల్పానికి ఉక్కు లాంటి పదవి:
 యువగలం పాదయాత్ర సమయం నుంచి ప్రవీణ్ కుమార్ రెడ్డి కడప జిల్లాలో తన మార్కు చూపిస్తూ వస్తున్నారు. యువకుడు కావడంతో చంద్రబాబుకు ఎంతో నచ్చాడు.  ఆ టైంలోనే ఇచ్చిన మాట ప్రకారం ఆయనకు క్యాబినెట్ స్థాయి ఉండే పదవి ఇవ్వడానికి ఇప్పటికే కసరత్తులు అన్ని పూర్తి చేశాడు. కడప జిల్లా పొద్దుటూరు పట్టణానికి చెందినటువంటి  గుండ్లూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉక్కు పరిశ్రమ కోసం సాగించినటువంటి పోరాటం  ఒక నేతగా ఎదిగేందుకు ఉపయోగపడింది. బీటెక్ పూర్తి చేసిన ప్రవీణ్ కుమార్ రెడ్డి "కడప ఉక్కు సీమ హక్కు" అనే నినాదంతో   ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఎంతోమంది యువకులను, విద్యార్థులను సమీకరించి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. పరిశ్రమ రాయలసీమకు ఎంత అవసరమో చాటిచెప్పారు. ఈ విధంగా ప్రజలందరినీ చైతన్యం చేసి ఉద్యమాన్ని ఎగిసేలా చేశారు. ఇలా ఉక్కు  సీమ హక్కు అనే నినాదం  ప్రతి ఒక్కరికి అర్థం అయిపోయింది. దీంతో గుండ్లురు ప్రవీణ్ కుమార్ కాస్త  ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డిగా మారారు. అంతేకాదు ఉక్కు పరిశ్రమ సాధన కోసం ప్రవీణ్ కుమార్ రెడ్డి  పొద్దుటూరు శివాలయం సెంటర్ లో 108గంటల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు.


దీంతో చంద్రబాబు నాయుడు దృష్టి ప్రవీణ్ కుమార్ రెడ్డిపై పడింది. ఇక అప్పటినుంచి ఆయనను  అక్కున చేర్చుకుంటూ వస్తున్నారు.  అయితే 2019 ఎన్నికల తర్వాత ప్రవీణ్ కుమార్ టిడిపి పార్టీలో చేరారు. యువగలం పాదయాత్ర సందర్భంలో నారా లోకేష్ కు బాగా దగ్గరయ్యారు. 2019 ఎన్నికల సమయంలో  టిడిపిలో చేరిన వరదరాజులరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఈయనకు ఉక్కు ప్రవీణ్ సహకారం అందలేదు. అక్కడ వైసీపీ అభ్యర్థి  రాచమల్ల శివప్రసాద్ రెడ్డి విజయం సాధించారు. ఇక అప్పటినుంచి ఆ నియోజకవర్గంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డిపై ఒంటరి పోరు చేస్తూనే వస్తున్నారు. ఇప్పటికే ఈయనపై 14 కేసులు నమోదయ్యాయి. 29 సార్లు జైలుకు వెళ్లొచ్చారు. అన్ని అనుభవించిన ప్రవీణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగారు. 2024 ఎన్నికల్లో తన టికెట్ వస్తుందని ఆశించారు. యాక్టివ్ గా ఉన్నారు కానీ సీనియర్ అయినా వరదరాజుల రెడ్డికి చంద్రబాబు టికెట్ ఇవ్వడంతో ఆయన గెలుపొందారు. ఇదే సమయంలో ప్రవీణ్ కుమార్ కు తప్పక క్యాబినెట్ హోదా పదవి ఇస్తామని హామీ ఇచ్చారు.  దాని ప్రకారమే ప్రవీణ్ కుమార్ రెడ్డికి  "ఏపీఐసీసీ" చైర్మన్ పదవి  కట్టబెట్టే అవకాశం ఉన్నట్టు అనేక వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: