- టిడిపిలో సీనియర్ గా యరపతినేని
- కష్టకాలంలో పార్టీకి అండగా.!
- మంత్రి హోదా కలిగే నామినేటెడ్ పదవి.!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అద్భుతమైన పాలన అందుతోంది. ఇదే తరుణంలో కూటమిలో భాగస్వామ్య మైనటువంటి జనసేన, బీజేపీలు కూడా ఎన్నికల్లో విజయానికి కీలక పాత్ర పోషించాయి. దీంతో మంత్రివర్గ కూర్పులో అన్ని సామాజిక రాజకీయ సమీకరణాలు గమనించి మంత్రి పదవులు కట్టబెట్టారు చంద్రబాబు నాయుడు. ఈ తరుణంలో కొంతమంది టీడీపీలో సీనియర్ల గా ఉండేటువంటి నేతలకు ఈసారి మంత్రి పదవులు రాలేదు. అలాంటి వారి కోసం అద్భుతమైన నామినేటెడ్ పదవులు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలా మంత్రి పదవి మిస్ అయిన వారిలో యారపతినేని శ్రీనివాసరావు కూడా ఒకరు. టిడిపి పార్టీలో సుదీర్ఘకాలంగా ఆయన పనిచేస్తూ వస్తున్నారు. పలుమార్లు ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. అలాంటి ఈయనకు ఈసారి తప్పక మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. కానీ సామాజిక సమీకరణాల దృష్ట్యా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో నామినేటెడ్ పదవి ఆయనకు అందించాలని చూస్తున్నారు. మరి శ్రీనివాసరావుకు ఎలాంటి నామినేటెడ్ పదవి ఇవ్వబోతున్నారు అనే వివరాలు చూద్దాం.

 యరపతినేనికి కీలక పదవి:
 ఏపీ రాష్ట్రంలో మూడు పార్టీల నుంచి 23వేల మంది నామినేటెడ్ పదవుల కోసం దరఖాస్తు చేశారు. దీంతో పవన్ ,పురంధరేశ్వరిలతో చర్చలు జరిపిన చంద్రబాబు  అన్ని పార్టీలకు సమన్యాయం జరిగేలా నామినేటెడ్ పదవి భర్తీ చేయబోతున్నారు. మొదటిసారి ప్రకటించే పోస్టుల పైన ఇప్పటికే కసరత్తు పూర్తి అయిపోయింది. ఒకటి, రెండు రోజుల్లో  ప్రకటన కూడా బయటకు రానుంది.


ఇదే తరుణంలో   గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ సభ్యునిగా నియమించేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఆ పదవిని ఆయన వ్యతిరేకించినట్లు సమాచారం. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో విధమైనటువంటి పదవిని ఆశిస్తూ నచ్చని పదవి ఇస్తే వద్దని మొహం చాటేస్తున్నారట.  మరి చూడాలి సీనియర్ ఎమ్మెల్యే యారపతినేని శ్రీనివాసరావుకు  టిటిడి పాలకవర్గ సభ్యునిగా చంద్రబాబు ఒప్పిస్తారా, లేదంటే మరో నామినేటెడ్ పదవి కట్టబెడతారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: