•పాలకమండలి సభ్యుడిగా బోండా ఉమా..

•మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఉమా

* న్యాయం జరిగేనా..


(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)


2024 ఎన్నికల తర్వాత అనూహ్యంగా కూటమి అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా జనసేన, బీజేపీ, టిడిపిలు కూటమిగా ఏర్పడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. ఏకంగా 164 సీట్లు కైవసం చేసుకున్నారు. ఇకపోతే పార్టీ కోసం గత కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్న చాలామందికి ఈసారి పదవులు లభించలేదు. పైగా పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసుకున్న ఎన్నారైలు కూడా పదవులు ఆశించారు. ముఖ్యంగా మంత్రి పదవి ఆశించిన చాలామంది ఈసారి పదవులు కోల్పోయారు. దీంతో వారందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అలాంటి వారిని దూరం చేసుకోవడం ఇష్టం లేక నామినేటెడ్ పదవుల కింద కొంతమందికి పదవులు అందించే ప్రయత్నం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరికి ఒక్కో విభాగంలో నామినేటెడ్ కింద పదవులు ఇవ్వబోతున్నారు.

మరి గతంలో మంత్రి పదవి కోసం ఆశించి నిరాశ ఎదుర్కొన్న  బోండా ఉమామహేశ్వరరావు కి ఈసారి పదవి లభిస్తుందా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. పార్టీ కోసం గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న ఈయన ఎలాగైనా సరే మంత్రి పదవి దక్కించుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ ఆయనకు ఎటువంటి పదవి దక్కలేదు. దీంతో పూర్తిస్థాయిలో నిరాశ వ్యక్తం చేయడమే కాకుండా ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఇకపోతే ఈసారి డబ్బు ఉన్న వారికి కాకుండా పార్టీ కోసం త్యాగం చేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ఆశించారట. ఇక అందులో భాగంగానే బోండా ఉమా కి కూడా ఈసారి నామినేటెడ్ పదవి లభించబోతుందని సమాచారం.

ఇకపోతే పాలకమండలి సభ్యులుగా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ప్రధమంగా  బోండా ఉమా కోన రవికుమార్ , నక్క ఆనంద్ బాబు, జోష్ణ తిరునగిరి , సుచిత్ర వీరికి మాత్రము నామినేటెడ్ పదవి లభించే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికైతే మంత్రి పదవి ఆశించి బంగపడిన ఓ బోండా ఉమాకు నామినేటెడ్ పదవి కట్టబెట్టబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: