* రాజకీయాల్లో అనేక పాత్రలు చేసిన ఉండవల్లి.!
* నామినేటెడ్ పోస్ట్ పై గంపేడాశతో ఉండవల్లి.!
* అధినేత రియాక్షన్ అదేనా..?

(ఆంధ్రప్రదేశ్-ఇండియాహెరాల్డ్): ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరాక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం నామినేటెడ్ పదవుల భర్తీ.ఎప్పుడూ చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పదవుల విషయంలో ఇంత త్వరగా నిర్ణయం తీసుకున్నదే లేదు 2014 ప్రభుత్వంలో కూడా రెండేళ్ల తర్వాతే నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు.అయితే ఈసారి నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో తీవ్రమైన ఒత్తిడికి లోనైనట్లు తెలుస్తుంది.చాలామంది నాయకులు ఆ పదవుల పై ఆశలు పెట్టుకున్నారు. అటువైపు చంద్రబాబు కూడా ఎటువంటి అలసత్వం, ఆలస్యం చేయకుండా వెంటనే డెసిషన్ తీసుకున్నారు. దీని ప్రకారంగానే నామినేటెడ్ పదవుల భర్తీ మొదటి లిస్ట్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఆ టైమ్ వచ్చేసింది అంటూ,మంత్రి అవ్వటానికి అన్ని అర్హతలు ఉన్న ప్రత్యేక కారణాలవల్ల మంత్రి పదవి దక్కని వాళ్ళు, ఎన్నికలకు ముందు కూటమి కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, పార్టీ గెలుపు కోసం శ్రమించిన వాళ్ళు ఈ నామినేటెడ్ పదవులపై చాలా ఆశలు పెట్టుకున్నారు. మొత్తం రాష్ట్రంలో దాదాపు 90 కార్పొరేషన్స్, సంస్థలు ఉన్నాయి. వీటిలో చైర్మన్తో వివిధ పదవులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం మారడంతో ఆ పదవులన్నీ ఖాళీ అవుతున్నాయి.ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొలువు దీని ఉంది కాబట్టి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ 40 శాతం నామినేటెడ్ సీతను జనసేన బిజెపికి కేటాయించింది తెలుగుదేశం అందుకే ప్రతి నామినేటెడ్ పోస్టుకు అర్హులైన ఐదుగురు అభ్యర్థులను ఫిల్టర్ చేశానని వినిపిస్తోంది40% నామినేటెడ్ సీతను జనసేన బిజెపి కేటాయించారు.అయితే మొదటి లిస్ట్ లో భాగంగా 40 పదవుల వరకు భర్తీ చేయవచ్చు అని అంటున్నారు. అయితే ఫస్ట్ లిస్ట్ తయారీ అనేది అత్యంత గొప్యంగా ఉంచనున్నారు.

నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నారా లోకేష్, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి ఈ లిస్ట్ తయారు చేసారని తెల్సింది. టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ మరియు అతని టీం ఈ విషయంలో నేతలకు ర్యాంకింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొలువుతీరి ఉంది కాబట్టి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ 40 శాతం నామినేటెడ్ సీట్లను జనసేన, బిజెపికి కేటాయించింది. అందులో60% టీడీపీకి,30% జనసేనకు ఉంటే 10% బీజేపీకి ఇచ్చినట్లు సమాచారం.వందల్లో పోస్ట్లు ఉంటే వేలల్లో అభ్యర్థులు ఈ పోస్టుల కోసం అప్లై చేసుకున్నారు. అందుకే ప్రతి నామినేటెడ్ పోస్టుకు అర్హులైన ఐదుగురు అభ్యర్థులను ఫిల్టర్ చేశారని తెలుస్తుంది. మరల ఆ అయిదుగురిలో కూడా ఎవరికి ఆ పోస్టు వరిస్తుంది అనేది గొప్యంగా ఉంచారు.అయినప్పటికీ కొన్ని లీక్స్ బయటివచ్చాయి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని లోకేష్ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఏదేమైనా వచ్చిన లీక్స్ బట్టి లాయల్టీ, హార్డ్ వర్క్, సిన్సియారిటీ వంటి అంశలు బట్టి లిస్ట్ రెడీ చేసినట్లుగా తెలుస్తుంది.అయితే ఈ నామినేటెడ్ పదవి ఆశించడంలో ఉండవల్లి శ్రీదేవి మాజీ వైసీపీ ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీను వీడి టీడీపీలోకి చేరారు. టీడీపీలోకి చేరినా తర్వాత పార్టీ టికెట్ ఆశించి అది కాస్త దక్కకపోవడంపై మరల టీడీపీ అధినేత చంద్రబాబు పై వెన్నుపోటు అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ టైములో ఆమెకు టీడీపీ నేతలు నచ్చచెప్పడంతో పరిస్థితి సద్దుమనిగిన ప్రస్తుతం ఆమె నామినేటెడ్ పోస్టు పైఆశలు పెట్టుకుంది. దాంతో టీడీపీ అధినేత కూడా ఆమెకు ఏదో ఒక శాఖలో నానిమటెడ్ పోస్టు ఇవ్వాలని భావించినట్లు తెలుస్తుంది.అయితే అధినేత ఆమెకు ఎల్ఐడిక్యాప్ చైర్మన్ గా నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది అయితే దానికి పార్టీ సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ నామినేటెడ్ పోస్ట్లు భర్తీ అనేది మాత్రం రాజకీయా దిగ్గజం అయినా చంద్రబాబుకు కత్తిమీద సమూలాంటిదే అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: