ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  గొప్పలు చెప్పుకోవడం జరుగుతొంది. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఉన్న అంతర్జాతీయ స్టేడియం కి తోడుగా మరొక అంతర్జాతీయ స్టేడియాన్ని సైతం తీసుకురాబోతున్నట్లు సమాచారం. కొత్తగా ఏర్పడిన ఈ కార్యవర్గం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి రాజధాని అమరావతి కి మరింత పాపులారిటీ వచ్చేలా మంగళగిరిలో సరికొత్త స్టేడియాన్ని నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మంగళగిరి ఎమ్మెల్యేగా నారా లోకేష్ ప్రస్తుతం వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ ఏర్పాటుచేసిన కూటమి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలయితే వినిపిస్తున్నాయి.


అయితే ఒక ఏడాదిలోపే ఈ క్రికెట్ స్టేడియం ని అధునాతన హంగులతో నిర్మించాలని కూటమి ప్రభుత్వం ప్లాన్ వేస్తోంది. ఆంధ్ర క్రికెట్ కి మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేలా పలు రకాల నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.వచ్చే రెండు సంవత్సరాలలో ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ను కూడా నిర్వహించేలా పలు రకాల ప్రణాళికలను సైతం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ స్టేడియాను నిర్మించడం సాధ్యమేనా అంటే అది చాలా కష్టమని కచ్చితంగా స్టేడియం నిర్మించాలి అంటే సుమారుగా కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంతేకాకుండా సుమారుగా భూమికావలసి ఉంటుంది.. అంతటి బడ్జెట్ ఏపీ దగ్గర ఉందా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.


ఇటీవలే ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కేశినేని చిన్ని ప్రకటించడం జరిగింది. వచ్చేనెల 8వ తేదీ నుంచి బాధ్యతలు చేపట్టబోతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు హనుమ విహారిని గత ప్రభుత్వం కక్షగట్టి మరి క్రికెట్ నుండి పంపించే కుట్రలు చేశారని తెలియజేశారు. అయితే లోకేష్ మాత్రం తనని ఒప్పించి మరీ ఇక్కడికి వచ్చి ఆడేలా చర్యలు తీసుకుంటామంటూ తెలియజేస్తున్నారు. రిటైర్డ్ అయిన కొంతమంది క్రికెట్లో సహాయం తీసుకుని ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ ను అభివృద్ధి చేసే ప్రణాళికగా రూపుదిద్దుకుంటామంటూ కూటమినేతల తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో క్రికెట్ ఆడే వారి సంఖ్య పెరగాలని విధంగా ఆంధ్ర అసోసియేషన్ పనిచేస్తుందని తెలుపుతున్నారు కేశినేని చిన్ని.

మరింత సమాచారం తెలుసుకోండి: