నిన్న మొన్నటి వరకు వైసీపీకి కంచి కోట్లుగా ఉన్న నియోజకవర్గాలు ఇప్పుడు వరుస పెట్టి కోల్పోతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట.. వైసీపీ ఆవిర్భావం నుంచి అక్కడ ఆ పార్టీ హవా నడిచింది. వరుసగా రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికలలోను వైసీపీ అభ్యర్థులు విజ‌యం సాధించారు. మొన్న సార్వత్రిక ఎన్నికలలో టిడిపి జెండా ఎగరడంతో పరిస్థితి మారిపోయింది. వైసీపీలో ఉన్న నాయకులు అందరూ మూకుమ్మ‌డిగా టిడిపిలో చేరుతున్నారు. నియోజకవర్గానికి చెందిన టిడిపి సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి - మాండ్ర శివానందరెడ్డి సమక్షంలో వైసిపి నాయకులు అందరూ టిడిపి కండువా క‌ప్పుకుంటున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీలో వైసీపీ ఖాళీ అయ్యింది. ప్రస్తుతం మండల స్థాయి నాయకులు కూడా వైసిపి ని వీడుతున్నారు. దీంతో వైసీపీ నాయకులు పార్టీ కేడర్ను ఎలా కాపాడుకోవాలో ? అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.


పదేళ్లుగా తాము చెప్పిందే విన్న అక్కడ ప్రజలు నేతలు ఇప్పుడు పార్టీని వదిలేసి వెళుతుంటే ఏం చేయాలో ? తెలియని పరిస్థితి. నందికొట్కూరు నియోజకవర్గంలో 20 ఏళ్ల కిందట టిడిపి వైభవం మళ్లీ కనిపిస్తుందని ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. మున్సిపాలిటీలో మొత్తం 29 స్థానాలుకుగాను వైసీపీ ఏకంగా 28 స్థానాలు గెలుచుకుంది. టిడిపి ఒక్క స్థానానికి పరిమితమైంది. ఇక్కడ టిడిపి గెలిచిన వెంటనే మున్సిపాలిటీ పదవీకాలం ఇంకా రెండేళ్లు ఉండటం.. పైగా రాష్ట్రంలో టిడిపి వన్ సైడ్ కి విజయం సాధించడంతో కౌన్సిలర్లు పూర్తిగా ఆలోచనలో పడిపోయారు.


అందుకే వారందరూ పార్టీ మారిపోయారు.. ఇక వైసిపి కీలక నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా పార్టీని పట్టించుకోవడం లేదు. ఇక్కడ కౌన్సిలర్లతోపాటు నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నేతలు అందరూ తమ రాజకీయ భవిష్యత్తు కోసం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి - మాండ్ర శివానందరెడ్డి - ఎమ్మెల్యే గిట్టా జై సూర్య సమక్షంలో టిడిపిలో చేరిపోతున్నారు. ఇక బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇక్కడ వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు టిడిపి హవా ఉండేది ... మళ్లీ ఈ నెలకు బైరెడ్డి కుమార్తె శబరి నంద్యాల ఎంపీగా గెలవడంతో నందికొట్కూరు నియోజకవర్గంలో టిడిపి జెండా రెపరెపలాడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: