ఏ రాష్ట్రంలో అయినా ఎలక్షన్లు పూర్తి అయ్యే పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే చాలు ఆ పార్టీ కోసం ఎంతో పని చేసి కొన్ని పరిస్థితులలో ఒకే నియోజకవర్గంలో ఇద్దరు వ్యక్తులు మధ్య భారీ పోటీ ఉన్నట్లు అయితే కొంత మంది క్రేజ్ ఉన్న నాయకులు కూడా సీట్లను వదిలేస్తూ ఉంటారు. అలాంటి వారు , మరి కొంత మంది సీనియర్ నాయకులు కూడా నామినేటెడ్ పోస్టు లను తమ పార్టీ అధికారంలోకి రాగానే తమకే వస్తాయి అని ఆశిస్తూ ఉంటారు.

దానితో అధికారంలో ఉన్న పార్టీకి ఎవరికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలా ... ఎవరు దేనికి అర్హులు అనే నిర్ణయించడంలో పార్టీ నాయకత్వాలు చాలా తర్జనభజనలు పడుతూ ఉంటాయి. ఇక ఇందులో కూడా అసంతృప్తి రాకుండా ఏమీ ఉండదు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మనకు తెలిసిందే.

ఇందులో భాగంగా తెలుగు దేశం , జనసేన , బిజెపి మూడు పార్టీలు కలిసి పొత్తులో భాగంగా పోటీ చేశాయి. ఇక కూటమి కి అద్భుతమైన స్థానాలు వచ్చాయి. దానితో తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రి అయ్యాడు. దానితో కూటమి గా పోటీ చేయడం వల్ల ఈ సారి చాలా మంది సీనియర్ నాయకులు తమ ప్రాంతాలలో సీట్లను వదులుకోవాల్సి వచ్చింది.

అలాగే సీటు రాకపోయినప్పటికీ తమ పార్టీ అధికారం లోకి రావాలి అనే ఉద్దేశంతో ఇతర పార్టీ నాయకులకు సపోర్ట్ చేసిన వ్యక్తులు కూడా కొంత మంది ఉన్నారు. దానితో వారంతా ఇప్పుడు నామినేటెడ్ పోస్టులను కోరుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి.

అందులో భాగంగా మొదట 49 పోస్టులను చంద్రబాబు భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నామినేటెడ్ పోస్టులకు చంద్రబాబు ... టిడిపి పార్టీకి 70 శాతం , జనసేన పార్టీకి 20 శాతం , బిజెపి పార్టీకి 10 శాతం కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే చంద్రబాబు ఏ పార్టీకి ఎంత శాతం నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి అనే దానిపై ఒక స్పష్టతకు వచ్చాడు.

కానీ ఎవరికి ఏది ఇవ్వాలి అనేదానిపై పెద్దగా స్పష్టతకు రానట్లు తెలుస్తోంది. దానితో తమ పార్టీ నుండి మాకు కావాలి అంటే మాకు కావాలి అనే వాదనలు వినిపిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఈ నామినేటెడ్ పోస్టులు ఎవరికి వరిస్తాయి అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap