బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.. వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో రాష్ట్రవ్యాప్తంగా యంగ్ లీడర్ గా బాగా పాపులర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటే లోకేష్ కూడా మంచి విలువ ఇచ్చేవారు. అనంతరం వైసీపీలోకి వెళ్ళిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా వైసిపి యువజన విభాగంలో ఒక కీలక లీడర్గా ఎదిగారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన నేత అయినా రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి కేడర్లో మంచి పాపులార్‌ అయ్యారు. ఒకానొక దశలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎంతోమంది సీనియర్ నేతలు.. మంత్రులు.. ఎమ్మెల్యేలుగా ఉన్న వారికి మించిన క్రేజ్‌ సిద్ధార్థ్‌ రెడ్డికి వచ్చేసింది. జగన్ సైతం కీలక పదవి ఇవ్వాలని అనుకున్నారు.


అయితే జిల్లాకు చెందిన అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలు.. మంత్రులు ... ఎంపీలు అందరూ వెళ్లి సిద్ధార్థ రెడ్డికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే తమ హవాకు గండిపడుతుందని వాపోవ‌డంతో జగన్ చిన్న నామినేటెడ్ పదవి ఇచ్చి సరి పెట్టేశారు. చివరకు ఐదేళ్లపాటు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఆర్డర్ కు సిద్ధార్థ రెడ్డికి అస్సలు పడలేదు. ఎన్నోసార్లు పంచాయితీలు జరిగాయి. చివరకు ఎన్నికలవేళ సిద్ధార్థ రెడ్డి పంతం నెగ్గించుకున్నారు. ఆర్డర్ కు సీటు రాకుండా అడ్డుకున్నారు. తాను చెప్పించుకున్న వ్యక్తికి సీటు ఇప్పించుకున్నా కూడా నందికొట్కూరులో వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది.


టిడిపి నుంచి పోటీ చేసిన జై సూర్య విజయం సాధించారు. ఇక పార్టీ ఓడిపోయాక నందికొట్కూరు నియోజకవర్గంలో సిద్ధార్థ రెడ్డి అడ్రస్ లేకుండా పోయారు. వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి తో పాటు కీలక నేతలు టిడిపిలో చేరిపోయారు. ఆ వెంటనే మరో పదకొండు మంది కౌన్సిలర్లు కూడా టిడిపిలో చేరారు. ప్రస్తుతం నందికొట్కూరు మున్సిపాలిటీలో టిడిపి బలం పెరిగింది. వైసీపీ బలం ఒకరిద్దరికీ పడిపోయింది. నందికొట్కూరు మున్సిపాలిటీ వైసీపీకి దూరం అయింది.


ఇక నియోజకవర్గంలోనూ అన్ని మండలాల్లో మెజార్టీ ఎంపీటీసీ స్థానాలు వైసిపి ఆధీనంలో ఉండేవి. అయితే ఇప్పుడు ఎంపీటీసీలు ... మండల స్థాయి నాయకులు కూడా ఒక్కొక్కరు సైకిల్ ఎక్కిస్తున్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో వైసిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీ కొనసాగింది. ఒక్క దెబ్బతో పార్టీ ఓడిపోయిన వెంటనే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అడ్రస్ లేకుండా పోవడంతో వైసీపీ శ్రేణులు కూడా బైరెడ్డి ఎక్కడున్నావు తోక ముడిచావా అంటూ సెటైర్లు ఇస్తున్న పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: