తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా తయారైన సంగతి మనందరికీ తెలిసిందే. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ... అధికారం కోల్పోవడం జరిగింది. దీంతో గులాబీ పార్టీ పరిస్థితి... అత్యంత దారుణంగా తయారయింది. ఇలాంటి నేపథ్యంలోనే గులాబీ పార్టీలో కీలక మార్పులు చేసేందుకు కేసిఆర్ కూడా నడుము కట్టుకున్నారు. మళ్లీ ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు వ్యూహరచనలు చేస్తున్నారు.


తాజాగా డీఎంకే బాటలో నడిచేందుకు గులాబీ పార్టీ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. గులాబీ పార్టీని బలోపేతం చేయడం కోసం... కొత్త స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేటీఆర్ నేతృత్వంలో కొంతమంది గులాబీ నేతలు చెన్నైకి వెళ్ళనున్నారట. సెప్టెంబర్ మాసంలో చెన్నై పర్యటనకు కేటీఆర్ టీం వెళ్లేందుకు రంగం సిద్ధం అయిందట. ఈ మేరకు కేసీఆర్ కూడా కీలక ఆదేశాలు చేశారట.

 

గులాబీ పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసేందుకు... చెన్నైకి వెళ్లనున్నారట. వాస్తవంగా దేశ రాజకీయాలను.. డీఎంకే పార్టీ... ప్రభావితం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి డీఎంకే పార్టీ చాలా కష్టపడాల్సి వచ్చింది. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసింది డీఎంకే పార్టీ. అందుకే ఎన్ని రాజకీయ ఒత్తిడీలు గానీ... సమస్యలు వచ్చిన ఆ పార్టీ బలంగా నిల్చోని ఇప్పుడు అధికారంలోకి వచ్చింది.

 

అయితే ఇప్పుడు గులాబీ పార్టీ కూడా అదే పంథాలో వెళ్లేందుకు సిద్ధమవుతోంది. డీఎంకే పార్టీని ఫాలో అయి సక్సెస్ కావాలని ట్రై చేస్తోంది. చెన్నైకి వెళ్లేందుకు కూడా సిద్ధమైంది గులాబీ పార్టీ. డీఎంకే పార్టీ నేతలతో కూడా ఇప్పటికే కేసీఆర్ మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే... మళ్లీ గులాబీ పార్టీని గాడిలో పెట్టేందుకు ఈ స్కెచ్ లు వేస్తున్నారు. కాగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు దక్కించుకుంది గులాబీ పార్టీ. కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి గులాబీ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారయింది. పార్లమెంట్ ఎన్నికల్లో అసలు ఖాతా కూడా ఓపెన్ చేయలేదు గూలాబీ పార్టీ. 

మరింత సమాచారం తెలుసుకోండి:

brs