- ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ) .
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న కీలకమైన పదవులు నామినేటెడ్ పదవుల భ‌ర్తీ కి శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాతో పాటు ఏలూరు జిల్లాలో ఎవరెవరికి నామినేటెడ్ పదవులు వస్తాయి అన్నదానిపై అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ఈ ఎన్నికలలో కూడా జనసేన - బిజెపితో పొత్తు ఉండడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా నియోజకవర్గాలలో త్యాగాలు చేయక తప్పని పరిస్థితి. మరి నామినేటెడ్ పదవులు భర్తీలో వీరందరికీ అవకాశాలు వస్తాయా ? ఎవరెవరు పేర్లు ప్రముఖంగా తెర మీదకు వస్తున్నాయో చూద్దాం .


ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న గన్ని వీరాంజనేయులు ఎన్నికలలో జనసేన కోసం ఉంగుటూరు సీ టు త్యాగం చేశారు. ఏలూరు జిల్లా నుంచి నామినేటెడ్ పదవి రేసులో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే పోలవరం ఇన్చార్జిగా ఉన్న బొరగం శ్రీనివాస్ తో పాటు నూజివీడులో మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు ... ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్గా ప‌నిచేసిన‌ ముళ్ళపూడి బాపిరాజు - తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్చార్జి వ‌లవల బాబ్జి - నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు తదితరు ల పేర్లు నామినేటెడ్ పదవుల ఎంపికలో ప్రముఖంగా తెరమీదకు వస్తున్నాయి.


అలాగే చింతలపూడి మాజీ ఎమ్మెల్యే .. మాజీమంత్రి పీతల సుజాత పేరు కూడా ఒక కీలకమైన నామినేటెడ్ పదవి రేసులో ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే నామినేటెడ్ పదవులు తక్కువగా ఉండటం అటు జనసేన - బిజెపి వాళ్లకు కూడా కొన్ని పదవులు ఇవ్వాల్సి ఉండడంతో అందరికీ నామినేటెడ్ పెదవులు వస్తాయా ? చంద్రబాబు ఎవరికీ తీపి కబురు చెబుతారు ... ఎవరికి చేదు కబురు చెబుతారో ? చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: