పీత‌ల సుజాత తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ మహిళా నాయకురాలు.. మాజీ మంత్రి పార్టీ కోసం చాలా కమిట్మెంట్ గా పనిచేసే నేత గా సుజాత‌కు ఎంతో పేరు ఉంది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉండి 2004 ఎన్నికలలో ఆచంట నుంచి పోటీ చేసిన సుజాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభంజనం తట్టుకునే మరీ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 ఎన్నికలలో ఆమెకు టికెట్ దక్కలేదు. 2014లో చింతలపూడి నుంచి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యే గా విజయం సాధించటంతో పాటు చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. మూడేళ్లపాటు ఆమె మంత్రిగా ఉన్నారు. 2019 ఎన్నికలలో ఆమెకు సీటు దక్కకపోయినా పార్టీ గెలుపు కోసం పలు నియోజకవర్గాల్లో పనిచేశారు.


2019లో పార్టీ ఘోరంగా ఓడిపోయిన కూడా చింతలపూడి నియోజకవర్గంలో పార్టీ కేడ‌ర్ కు అందుబాటులో ఉంటూ వచ్చారు. ఇక తాజా ఎన్నికలలోను ఆమెకు సీటు దక్కలేదు. ఎస్సీ మాల సామాజిక వర్గంలో మహిళ నేతగా ఉండటం ... మాజీ మంత్రి కావటం పార్టీ కోసం 20 ఏళ్లకు పైగా క్రమశిక్షణతో పని చేస్తూ ఉండటంతో సుజాతకు ఈసారి కచ్చితంగా ఏదో ఒక నామినేటెడ్ పదవి వస్తుందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం సుజాతకు ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి వస్తుందని అంటున్నారు.


చంద్రబాబు రెండు మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కీలకమైన నామినేటెడ్ పదవుల భర్తీకి శ్రీకారం చుట్టనున్నారు. ముందుగా ఈ ఎన్నికలలో పార్టీ కోసం సీట్లు త్యాగం చేసిన కీలక నేతలు సీనియర్ నేతలతో పాటు జనసేన సీనియర్ నేతలకు పదవులు ఇస్తారని అంటున్నారు. ఇక పీత‌ల సుజాత పేరు కూడా తొలి జాబితాలోనే ఉంటుందని తెలుస్తోంది. పీతల సుజాతకు కీలకమైన ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి వస్తే మళ్లీ రాజకీయంగా ఆమె హ‌వా ప్రారంభమైనట్టే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp