ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ రెడ్డి హెడ్ క్వార్ట‌ర్ ఇప్పుడు బెంగళూరు. తాడేపల్లికి బదులుగా బెంగ‌ళూరు ఎల‌హంక ఆఫీస్‌ ఆయనకు క్యాంప్ ఆఫీస్ గా మారింది. ఎప్పుడైనా ప్రజలకు తెలిసే సమావేశాలు పెట్టుకోవాలనుకున్నప్పుడు మాత్రమే జగన్ ఆంధ్రకు వస్తారు .. మిగిలిన సమయం అంతా బెంగళూరుకే పరిమితం అవుతున్నారు. జగన్ తాడేపల్లిలో ఉండేందుకు ఎందుకు ? ఇష్టపడటం లేదన్నది ఇప్పుడు చాలామందికి సమాధానం లేని ప్రశ్నగా ఉంది. జగన్ ఇంట్లో ప్రభుత్వ ఫర్నిచర్ ఉంది .. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు ఆ ఫర్నిచర్ స్వాధీనం చేసుకునేందుకు ఎలాంటి ? నోటీసులు జారీ చేయలేదు. ఆయనను రాత్రికి రాత్రి ఎత్తేసే పనులు కూడా ఈ ప్రభుత్వం చేయదని తేలిపోయింది. మరి ప్రభుత్వం నుంచి ఇలాంటి వెసులు బాటులో ఉన్న జగన్ తాడేపల్లిలో ఉండేందుకు ఎందుకు ? ఇష్టపడటం లేదు అన్న ప్రశ్న అందరి మదిని తొలిచి వేస్తోంది.


జగన్ తన రాజకీయలు అన్నీ కుట్రల మీదనే ఉండేలా చేసుకుంటారు. జగన్ కుట్ర రాజకీయాల సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చేవారి గురించి బయటకు తెలియకుండా ఉండేందుకు ఆయన బెంగుళూరుకు మకాం మార్చారని అంటున్నారు. జగన్ హైదరాబాదులో ఉండి కుట్రలు .. కుతంత్రాలు పన్నేందుకు సమావేశాలు పెట్టిన బయట తెలిసిపోతుంది అదే బెంగుళూరులో ఉంటే ఎవరికి తెలియదు. పైగా బెంగళూరు నుంచి వేరే చోటుకు వెళ్లిన ఎవరికి తెలియదు .. తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అందుకే జగన్ ఎక్కువగా బెంగుళూరులో ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోంది. అదే టైంలో సొంత రాష్ట్రంలో ఉండి రాజకీయాలు చేయకపోతే క్యాడర్‌కు ధైర్యం ఉండదు. అసలే పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది.. అయితే ఇప్పుడు జగన్ పార్టీ నాయకులను పార్టీ కేడర్‌ను ఎంత మాత్రం పట్టించుకునే పరిస్థితుల్లో లేరు.. పార్టీలో ఉన్న వాళ్లే ఉంటారు ..పోయిన వాళ్లే పోతారు అన్నట్టుగా జగన్ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: