తెలుగుదేశం పార్టీ కంచుకోట హిందూపురం నియోజకవర్గంలో వరుసగా మూడోసారి గెలిచిన బాలయ్య తన ప‌ట్టు నిరూపించుకున్నారు. ఇది ఇలా ఉంటే హిందూపురం నియోజకవర్గం లో నట‌సింహం బాలయ్య కొట్టిన దెబ్బకు జగన్ పార్టీ వైసిపి అబ్బా అంటున్న పరిస్థితి. మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులు ఉండగా 2021 లో జరిగిన ఎన్నికలలో వైసీపీ 30 స్థానాలు ... తెలుగుదేశం ఆరు ... బిజెపి ఒకటి .. ఎంఐఎం ఒకటి గెలిచాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందే వైసీపీకి చెందిన ఇద్దరు ... ఎంఐఎం కౌన్సిలర్ టిడిపిలోకి చేరడంతో ఆ పార్టీ బలం 9కి పెరిగింది. బిజెపి కౌన్సిలర్ తో కలుపుకుంటే కూటమి పార్టీల బలం 10కి చేరింది.


ఇక రెండు రోజుల క్రితం చైర్ పర్సన్ ఇంద్రజ తో పాటు 8 మంది కౌన్సిలర్లు టిడిపిలో చేరారు. దీంతో ఇప్పుడు తెలుగుదేశం బ‌లం 19 కి పెరిగింది. లోక‌ల్ ఎమ్మెల్యే అయిన బాలయ్యతో పాటు హిందూపురం ఎంపీ కూడా ఇక్కడ ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఉంటారు. తెలుగుదేశం పార్టీ బలం పెరిగిన నేపథ్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ తన చైర్మన్ పదవికి .. వైసీపీకి రాజీనామా చేశారు. ఇక ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి 21 ఓట్లు ఉంటే ... వైసీపీకి 18 ఓట్లే ఉన్నాయి. అయితే మరి కొంతమంది వైసిపి కౌన్సిలర్లు కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.


ఇక తెలుగుదేశం పార్టీ తరఫున చైర్మన్ స్థానానికి అభ్యర్థి దాదాపు ఖరారు అయినట్టే తెలుస్తోంది. అయితే రెండు వైస్ చైర్మన్ పదవులు వైసిపి వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి.. వారిని పద‌వి నుంచి తప్పించాలంటే మరో ఆరు నెలలు వేచి చూడాల్సి ఉంది. ఒకవేళ వారు కూడా పదవులకు రాజీనామా చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్లకు అవకాశం వస్తుంది. ఏది ఏమైనా మొత్తానికి హిందూపురం మున్సిపాలిటీ బాలయ్య తెలుగుదేశం పార్టీ ఖాతాలో చాలా సులువుగానే వేశారని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp