మీడియా రంగంలో ద‌మ్ముండాలి.. దానికి కొంత ధైర్యం కూడా ఉండాలి. అన్నీ ఉండి.. త‌మ‌కు సాటి పోటీ లేర‌ని చెప్పుకొనే ఓ తెలుగు మీడియా ప‌రిస్థితి ఇప్పుడు ఇబ్బందుల్లోకి ప‌డుతోంద‌ని అంటున్నారు విశ్లేష కులు. ముఖ్యంగా మీడియా అధినేత రాజ‌కీయ పార్టీల అధినేత‌లతో వైరం పెట్టుకోవ‌డం.. వైరానికి  కాలు దువ్వ‌డం వంటివి ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. నిజానికిఒక వ్యాపారం చేస్తున్న‌ప్పుడు ఏదో ఒక మార్గం ఎంచుకోవాలి. దానిని కొన‌సాగించాలి.


అప్పుడే వ్యాపారం అభివృద్ది చెందుతుంది. కానీ, ద‌మ్ము పేరుతో చేస్తున్న దుమారంలో సంస్థ‌కేన‌ష్టాలు వ‌స్తున్నాయ‌న్న‌ది ఇప్పుడు జ‌రుగుతున్న చ‌ర్చ‌. టీడీపీకి అనుకూలంగా ఉన్న మీడియాల్లో ఈనాడు ముందున్న విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు వైసీపీ ప్ర‌భుత్వంతోనూ ఈనాడుక‌టీఫ్ చేసుకుంది. `ప్ర‌భుత్వం త‌ర‌ఫున మీరు మాకు ఎలాంటి యాడ్స్ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు` అని లిఖిత పూర్వ‌కంగా ఇచ్చేసి.. పూర్తిగా టీడీపీ సేవ‌లో త‌రించింది.


ఇదిత‌ప్పుకాదు.. ప‌త్రికాధినేత ఇష్టం. కానీ, మ‌రో ప‌త్రిక, మీడియా మాత్రం.. ఈ విష‌యంలో భిన్నంగా వ్య‌వ‌హ‌రించిందనే టాక్ ఉంది. తాము కూడా అగ్ర‌స్థానంలో ఉన్నామ‌ని.. త‌మ‌కు కూడా.. ఇత‌ర ప్ర‌ధాన మీడియాల‌తో స‌మానంగా డ‌బ్బులు ఇవ్వాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టింది. కానీ, ఈ విష‌యంలో బేరం కుద‌ర లేదు. అయినా.. ప్ర‌చారం అయితేజ‌రిగిపోయింది. చంద్ర‌బాబు సీటు ఎక్కేశారు. కానీ, ఈలెక్క‌లు మాత్రం తేల‌లేదు. దీనిని తేల్చుకునేందుకు స‌ద‌రు ప‌త్రిక అధినేత ప్ర‌య‌త్నించినా.. అప్పాయింట్‌మెంట్ ద‌క్క‌ని ప‌రిస్థితి.


దీంతో కొన్నాళ్లుగా యాంటీలైన్ తీసుకుంటున్నారు. ఈప‌రిణామం టీడీపీకి మింగుడు ప‌డ‌డం లేదు. మాకు అండ‌గా ఉంటార‌ని అనుకుంటే మాకే యాంటీ రాస్తారెందుక‌ని ప్ర‌శ్నించ‌డం ప్రారంభించారు. ఈ గ్యాప్‌ను మ‌రో మీడియా అందిపుచ్చుకుని .. కాసుల వ‌ర్షం కురిపించుకుంది. ఫ‌లితంగా ద‌మ్ము కాస్తా..దుమ్మ‌యింది . సొమ్ములు లేక ఈసురోమంటోంది. ఏదేమైనా.. ముందుగానే మాట్లాడుకున్న మేర‌కు తీసుకోవాలి. లేదా.. అస‌లు ప్ర‌చార‌మే మానుకోవాలి. కానీ, అప్పుడు అనుకూలంగా..ఇప్పుడు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేసి..అన‌వ‌స‌రంగా చేతులు కాల్చుకుంటున్నార‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: