- రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ప్రకారం 2026 లో జ‌నాభా లెక్క‌లు
-  ఏపీ అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 225 కు పెంపు
- తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 153కు .. !
- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )నిజంగానే ఇది రెండు తెలుగు రాష్ట్రా ల రాజ‌కీయ నాయ‌కుల‌కు గుడ్ న్యూస్ అని చెప్పాలి. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు అయిన రేవంత్ రెడ్డి... చంద్ర‌బాబు నాయుడు ఇద్ద‌రూ న‌క్క తోక తొక్కేశారు. 2026 లోనే శాసనసభ స్థానాల పునర్విభజన కు కేంద్రం సానుకూల‌త వ్య‌క్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో శాసనసభ స్థానాల పెంపు 2026 లోనే నని కేంద్రం తెలిపింది.   రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ప్రకారం 2026 లో జనాభా లెక్కల అనంతరమే ఏపీలో 175 నుంచి 225 శాసనసభ స్థానాలకు పెంచుతారు.


అలాగే తెలంగాణలో 119 నుంచి 153 శాసనసభ స్థానాలకు పెంపు ఉంటుంది. వాస్త‌వానికి రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కార‌మే రెండు తెలుగు రాష్ట్రాల లో నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య‌ను పెంచాల‌ని అనుకున్నారు. ఇక నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడే ఎస్సీ ఎస్టీ స్థానాలను కూడా  పునః సర్దుబాటు చేస్తారు.  ఆంధ్రప్రదేశ్ పునర్విభ జన చట్టం -2014 ను న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా మార్చి1, 2014 న గెజిట్ లో ప్రచురించినట్లు వివరించింది.


ఇక ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో అనుకూలంగా ఉన్న పార్టీల‌కు ఈ నియోజ‌క‌వ‌ర్గాల పెంపు కొంత అడ్వాంటేజ్ అవుతుంది. ఇక ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్రంలో కూడా మిత్ర‌ప‌క్షంగా ఉండ‌డంతో త‌న‌కు అనుకూలంగా నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌ను మార్చుకునే వెసులు బాటు అయితే ఉంటుంది. 2009 లో నాడు అధికారం లో ఉన్న వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి త‌నకు అనుకూలంగా ఈ పున‌ర్విభ‌జ‌న చేసుకున్నార‌న్న టాక్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: