2024 ఎన్నికల సమయంలో బిజెపి టిడిపి జనసేన పార్టీలో కూటమిగా జతకట్టాయి. ఎవరు ఊహించని విధంగా విజయాన్ని కూడా అందుకోవడం జరిగింది. అందరూ కూడా చంద్రబాబు పవన్ మాటలకు ఓకే అన్నట్టుగా పాలన సాగించారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో మాత్రం అక్కడక్కడ ఈ రెండు పార్టీలకు ఐక్యమత్యం కుదరలేదు.తాజాగా ఇప్పుడు జరిగిన ఒక సంఘటన అందుకు ఉదాహరణ అని కూడా చెప్పవచ్చు. గుడివాడలో మరొకసారి తెరపైకి రాజకీయ వేడెక్కే అంశం కనిపిస్తోంది.

అధికారం ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవెల్ లో టిడిపి జనసేన నేతల మధ్య వైర్యం కనిపిస్తోంది. తాజాగా గుడివాడలో నాగవరప్పాడు జంక్షన్ లో జనసేన జెండ దిమ్మెను ధ్వంసం చేసేందుకు సైతం టిడిపి నేత నరసింహారావు ప్రయత్నించారని జనసేన కార్యకర్తల సైతం ఆరోపిస్తున్నారు. ఈ విషయం పైన జనసేన కార్యకర్తలు కూడా ఆయనని అడ్డుకోవడం జరిగిందట. దీంతో టిడిపి నేతలు కూటమి ధర్మం పాటించలేదంటూ జనసేన నాయకులు ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు. దీంతో జాతీయ రహదారి పైన కూడా ఆందోళనకు దిగేందుకు వచ్చిన పరిస్థితి ఏర్పడిందట.


ఈ విషయాన్ని టిడిపి ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు సమాచారం అందించాలంటూ కోరారట. వెంటనే జనసేన పార్టీ జెండా కట్టిన దిమ్మెను కూల్చడానికి ప్రయత్నించిన నరసింహారావును టిడిపి నుంచి బహిష్కరించాలంటూ జనసేన నేతలు పలు రకాల నినాదాలతో రోడ్డుపైన బైఠాయించారు.అంతేకాకుండా టిడిపి నేతలు కూడా అక్కడ చేరుకోవడంతో కాస్త తోపులాట కూడా జరిగినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి అటు జనసేన నాయకులను టిడిపి నాయకులను సైతం సర్దిచెప్పి పంపించారట. టిడిపికి చెందిన బీసీ నేతగా పేరుపొందిన దారం నరసింహారావు ఎన్నికల ముందు సమయంలో వైసీపీ నుంచి టిడిపి పార్టీలోకి చేరారట.. ఇలాంటి ఆయన ఇప్పుడు జనసేన పార్టీ దిమ్మెను ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తూ ఉండడంతో ఆ పార్టీ ఇన్చార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ అడ్డుకోవడం జరిగిందట. ప్రస్తుతమైతే గుడివాడలో అడు టిడిపి వర్సెస్ జనసేనకు మారినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: