స్మార్ట్‌ఫోన్‌లో వచ్చే పాప్-అప్ యాడ్స్ చాలా చిరాకు పుట్టిస్తాయి, ముఖ్యంగా మీరు గేమ్‌లు ఆడుతున్నప్పుడు లేదా ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు అవి అంతరాయం కలిగించినప్పుడు బాగా ఇరిటేషన్ వచ్చేస్తుంది. వెబ్‌సైట్‌లు లేదా వీడియోలు ఓపెన్ చేసే ముందు కూడా చాలాసార్లు పాప్-అప్ యాడ్స్ వస్తాయి. కానీ, ఫోన్ సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఈ యాడ్స్ ఆపివేసే మార్గాలు ఉన్నాయి. ఫోన్‌లోని యాడ్స్ లను బ్లాక్ చేయడానికి, ఈ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది.

స్టెప్ 1: ఫోన్ సెట్టింగ్‌లు తెరవాలి. పైన ఉన్న సెర్చ్ బార్ కనుగొనే వరకు ఆప్షన్స్‌ ద్వారా స్క్రోల్ చేయండి.

స్టెప్ 2: సెర్చ్ బార్ లో "ప్రైవేట్ DNS" అని టైప్ చేసి, ఫలితాల్లో కనిపించినప్పుడు దాన్ని ఎంచుకోండి.

స్టెప్ 3: "ప్రైవేట్ DNS ప్రొవైడర్ హోస్ట్‌నేమ్" ఆప్షన్ పై క్లిక్ చేయాలి కనిపించే టెక్స్ట్ ఫీల్డ్‌లో, "privatedns.adguard.com" అని టైప్ చేయాలి.

స్టెప్ 4: హోస్ట్‌నేమ్ మార్చాక తర్వాత, మార్పులను సేవ్ చేయండి. ఇది మీ ఫోన్‌లో చాలా వరకు యాడ్స్ కనిపించకుండా నిరోధించడానికి సహాయపడుతుంది.

పైన చెప్పిన విధంగా చేసిన తర్వాత కూడా యాడ్స్ వస్తూనే ఉంటే, మరో పద్ధతిని ప్రయత్నించవచ్చు. ఆ పద్ధతి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం.

స్టెప్ 1: గూగుల్ అకౌంట్‌ని మేనేజ్ చేయండి. మీ ఫోన్ సెట్టింగ్‌లకు తిరిగి వెళ్లి, "మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్‌" అనే ఆప్షన్‌ని వెతకాలి.

స్టెప్ 2: గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్‌లో, "డేటా అండ్ ప్రైవసీ" అనే ఆప్షన్‌ని కనుగొని క్లిక్ చేయాలి.

స్టెప్ 3: "డేటా అండ్ ప్రైవసీ" సెక్షన్‌లో, "పర్సనలైజ్డ్ యాడ్స్" అనే సెట్టింగ్‌ని కనుగొనండి. ఈ ఫీచర్‌ని ఆఫ్ చేయడం వల్ల మీ ఆన్‌లైన్ యాక్టివిటీ ఆధారంగా యాడ్స్ మీకు కనిపించవు.

ఈ స్టెప్స్ పాటించడం ద్వారా, మీ స్మార్ట్‌ఫోన్‌లో పాప్ అప్ అయ్యే యాడ్స్ గణనీయంగా తగ్గించవచ్చు లేదా పూర్తిగా తొలగించవచ్చు, దీంతో మీ అనుభవం చాలా సున్నితంగా, అంతరాయం లేకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: