ప్రజల గవర్నమెంట్ అంటే.. ప్రజల భాగస్వామ్యం. కోట్లాదిమంది ప్రజలకు సంబంధించినటువంటి అంశము.. వాళ్లతో ముడిపడి ఉన్నటువంటి అంశమే. వాళ్లకి కీలకమైనటువంటి అంశం. ప్రజలను కన్విన్ చేయాలి కన్ఫ్యూజ్  చేయకూడదు. ఇందులో వినొచ్చు వినకపోవచ్చు ప్రజలు.. కానీ ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని అయితే కూల్చలేరు.. ఉదాహరణకు కూటమి ప్రభుత్వం 50 ఏళ్లకే పెన్షన్ బీసీ,ఎస్సీ,ST , మైనారిటీ ఎప్పటినుంచి ఇస్తారు. మహిళలకు 1500 రూపాయలు .. 18 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న మధ్య వారికి ఇస్తామని చెప్పారు అది ఎప్పటినుంచి ఇస్తారు. ఇవన్నీ పక్కన పెడితే.


ప్రస్తుతానికి తల్లికి వందనం.. ఈ ఏడాది ఇవ్వకపోతే ఆర్థికంగా నెలకు 5000 నుంచి 10000 సంపాదించే తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లలో చదివించే వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నది. అమ్మ ఒడి డబ్బులను స్కూల్ ఫీజు కింద జమ చేసుకునేవారు లేదా ఈ తల్లిదండ్రులు కొంత మాత్రం జమ చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు అది వేసేలా కనిపించడం లేదు కూటమి ప్రభుత్వం. అయితే ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్లలో చదివి పిల్లలను తీసుకోనీ పొమ్మంటూ తల్లితండ్రులకు చెబుతున్నారట.లేకపోతే డబ్బులు కట్టండి అంటూ అడుగుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.



అసలు తల్లికి వందనం ఇస్తారా లేదా అనే విషయం పైన కూడా క్లారిటీ ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం. వచ్చే ఏడాది అని అప్పుడు చెప్పారు. ఇప్పుడు ఇలాంటి వారి పరిస్థితి ఏమవుతుంది. ఒకవేళ ఇస్తామంటే ఎప్పుడు ఇస్తారని.. సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వచ్చే ఏడాది నుంచి అయినా  ఇస్తాము అంటే అది ఎంతమంది పిల్లలకైనా ఇస్తారా లేకపోతే.. ఒక్కలకు కూడా ఇవ్వకపోతే ఎలాగా అంటూ తల్లిదండ్రులు కూడా ప్రశ్నిస్తున్నారు. దీంతో వారిని రోడ్డుకి పడేసిన పరిస్థితి ఏర్పడింది.


ఇప్పుడు తాజాగా పెన్షన్లను తగ్గించేస్తామనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇంతకుముందు వాళ్ళు కూడా పెన్షన్లను లక్ష మందికి, 50 వేల మందికో తగ్గించాలని చూసినప్పుడు రచ్చ రచ్చ చేశారు. ఇప్పుడు అనర్హులను తీసేస్తామని చెప్పి వారి మీద ఏదో ఒక ఆరోపణ చెప్పి తీసేసేలా చేస్తున్నారట. ఇది నిజమే అయితే వాస్తవానికి 85 లక్షల మంది రేషన్ కార్డు కేంద్ర ప్రభుత్వం ఓకే చెబితే కోటి 47 లక్షల మంది రేషన్ కార్డు ని అందుకున్నారట. దాదాపుగా 60 లక్షల మంది. అందరినీ అనర్హులుగా తీసేస్తారా.. క్లారిటీ అనేది కూటమి ప్రభుత్వం ఇవ్వాల్సి ఉన్నది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ గురించి తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఆరోగ్యశ్రీ నీ నిలిపివేయడం కూడా చాలామందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయట. విషయం పైన కూడా ఏపీ ప్రజలు అసహనంతో ఉన్నారు. ఇలా ఇవే కాకుండా రైతు భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇతరత్రా వాటిపైన కూడా ప్రజలు కూటమిపైన చేయలేదని చాలా అసహనంతో ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: