* తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మనసులను గెలుచుకున్న ప్రభుత్వ పథకాలు  

* వాటన్నిటిలో కళ్యాణ లక్ష్మి పథకం హైలైట్

* ఇది వధువులకు ఒక వరం  

(తెలంగాణ - ఇండియా హెరాల్డ్)

 తెలుగు రాష్ట్రాల్లో ప్రజల మనసులో నిలిచిపోయే చాలా పథకాలను ఆయన ముఖ్యమంత్రి తీసుకొచ్చారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని మంచి పథకాలు అమల్లోకి వచ్చాయి. కేసీఆర్ ప్రభుత్వం పేద అమ్మాయిల పెళ్లికి ఆర్థిక సహాయం చేసేందుకు ఒక చాలా మంచి పథకాన్ని ప్రారంభించింది. దీన్నే 'కళ్యాణ లక్ష్మి పథకం' అని అంటారు. ఈ పథకం ద్వారా ఒక అమ్మాయి పెళ్లి అయినప్పుడు ఆమె కుటుంబానికి రూ.1,00,116/- ఇస్తారు. పేద కుటుంబాలకు పెళ్లి ఖర్చులు భరించడం చాలా కష్టం. ఈ పథకం వల్ల వారికి ఆర్థికంగా కాస్త ఊరట లభిస్తుంది.

పెళ్లి ఖర్చులు తగ్గడంతో పాటు బాల్య వివాహాలు కూడా తగ్గుతాయి. ఎందుకంటే పెద్దయ్యాక పెళ్లి చేస్తేనే ఈ పథకం ద్వారా డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు కోసం అయినా తల్లిదండ్రులు తమ పిల్లల పెళ్లిని వాయిదా వేసుకోవచ్చు. పెళ్లి తర్వాత చదువుకోవాలనుకునే అమ్మాయిలకు ఈ పథకం చాలా ఉపయోగకరం. 2018, మార్చి నాటికి, 3,90,000 మంది లబ్ధి పొందారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, 2014, అక్టోబర్ 2న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు చేస్తున్న ఒక గొప్ప కార్యక్రమం. ఈ పథకం మొదలైనప్పుడు, దళిత, గిరిజన వర్గాలకు చెందిన కుటుంబాలకు మాత్రమే రూ.51,000 ఇచ్చేవారు. కానీ తర్వాత, రాష్ట్రంలోని అన్ని పేద కుటుంబాలకు ఈ పథకం వర్తించేలా చేశారు. 2018-19 సంవత్సరంలో ఈ పథకం కోసం రూ.1,450 కోట్లు ఖర్చు చేశారు. ప్రభుత్వం పేద కుటుంబాల సంక్షేమానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది అని అర్థం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం కూడా ఇస్తామని మాటిచ్చింది. కానీ ఇంతవరకు ఆ హామీ నెరవేర్చలేదు.

కళ్యాణ లక్ష్మి పథకం ఎవరికి వర్తిస్తుంది?

తెలంగాణలోని ఏ కుటుంబానికి చెందిన 18 ఏళ్లు దాటిన అమ్మాయికైనా ఈ పథకం ద్వారా సహాయం పొందవచ్చు. అమ్మాయి తండ్రి, తల్లి ఇద్దరి సంయుక్త ఆదాయం సంవత్సరానికి రూ. 2 లక్షల కంటే తక్కువ ఉండాలి. ఏ మతానికి చెందిన అమ్మాయికైనా ఈ పథకం వర్తిస్తుంది. ముస్లిం అమ్మాయిల కోసం ప్రత్యేకంగా 'షాదీ ముబారక్' అనే పేరుతో ఈ పథకం అందుబాటులో ఉంది. పెళ్లికి 10 రోజుల ముందు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: