ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక గుడ్ న్యూస్ తెలియజేసింది... అదేమిటంటే విశాఖ కేంద్రంగా త్వరలోనే ఒక రైల్వే జోన్లు సైతం ఏర్పాటు చేయబోతున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఇటీవలే ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయం పైన ఒక సమన్వయంతో పని చేయబోతున్నారంటూ కూడా ఆయన తెలియజేశారు. ఎన్నో ఏళ్లుగా ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్నటువంటి ఈ ఆశ త్వరలోనే నెరవేరబోతోందంటూ తెలియజేశారు. ఈ విషయం పైన ప్రభుత్వాల అధికారుల మధ్య కూడా సానుకూలంగానే చర్చలు జరిగాయి అంటూ రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలియజేశారు.


ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు ఉన్నటువంటి అన్ని అడ్డంకులు కూడా తొలగిపోయాయి అంటు తెలియజేశారు. అలాగే భూమి కేటాయింపు ఇతర అంశాల పైన కూడా ఏపీ రాష్ట్ర సర్కార్ నుంచి పూర్తి సహకారం అందుతుంది అంటూ తెలియజేశారు.దీంతో త్వరలోనే విశాఖ రైల్వే జోన్ కేంద్ర కార్యాలయాన్ని సైతం నిర్మించబోతున్నామంటూ తెలియజేశారు. అందుకు సంబంధించిన అన్ని సన్నహాలు చేయడానికి సిద్ధమవుతోంది రైల్వే శాఖ అంటూ తెలిపారు.


గతంలో కూడా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిన కార్యాలయం ఏర్పాటు కోసం స్థలం విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి దీంతో కేంద్రం అడిగిన 52 ఎకరాల భూమిని సైతం సేకరించడంలో కాస్త ఆలస్యం కావడంతో రైల్వే జోన్ కార్యక్రమం ఏర్పాట్లు ఆలస్యమైనట్లుగా తెలియజేశారు. అయితే ఇప్పుడు తాజాగా రైల్వే శాఖ మంత్రి ప్రకటనతో కాస్త ఉత్తరాంధ్ర ప్రజలు ఆనందాన్ని సైతం తెలియజేస్తూ ఉన్నారు. ఇటీవల చంద్రబాబు కూడా ఢిల్లీ పర్యటనలో భాగంగా బిజెపి పెద్దలను కూడా కలవడం జరిగింది. చంద్రబాబు సహకారం వల్లే ఇవి వచ్చాయి అనే విధంగా పలువురు టిడిపి నేతలు తెలియజేస్తున్నారు. మరి విశాఖ రైల్వే జంక్షన్ ఎప్పుడు పూర్తి చేస్తారు చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: