మన దేశంలో ఉన్నత చదువులు చదవాలని కలలు కనే వాళ్లు ఎన్నో లక్షల మంది ఉన్నారు. అయితే అలాంటి వాళ్లలో చాలామంది కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఉన్నత చదువుల విషయంలో వెనుకడుగు వేస్తున్నారు. ఉన్నత చదువులు చదవాలంటే లక్షల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండటంతో చాలామంది పదో తరగతి, ఇంటర్ తోనే చదువు ఆపేయాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు.
 
అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అలాంటి పరిస్థితి రాకూడదనే ఆలోచనతో వైఎస్సార్ ఫీజు రీయింబర్స్ మెంట్ స్కీమ్ ను అమలు చేయడం జరిగింది. ఈ స్కీమ్ సూపర్ స్కీమ్ అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. తర్వాత రోజుల్లో పేర్లు మారినా వేర్వేరు పేర్లతో ఈ స్కీమ్ అమలవుతోంది. ఫీజు రీయింబర్స్ మెంట్ బీటెక్ చేయాలనే కల నెరవేరిందని చాలామంది విద్యార్థులు చెబుతున్నారు.
 
ఉమ్మడి ఏపీ విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడటంలో ఈ స్కీమ్ పాత్ర ఎంతో ఉంది. ఫీజు రీయింబర్స్ మెంట్ స్కీమ్ ద్వారా ఎంతోమంది విద్యార్థుల హృదయాల్లో వైఎస్సార్ దేవుడిగా నిలిచిపోయారు. వైఎస్సార్ ఐదేళ్లు మాత్రమే సీఎంగా పని చేసినా ప్రజలకు అన్ని విధాలుగా మేలు చేసే పథకాలను అయితే అమలు చేయడం జరిగింది.
 
ఫీజు రీయింబర్స్ మెంట్ స్కీమ్ ద్వారా కాలేజ్ ఫీజుతో పాటు హాస్టల్ ఫీజును సైతం చెల్లించడం జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ స్కీమ్ అమలైన తర్వాత ఈ స్కీమ్ కు మంచి పేరు రావడంతో ఇతర రాష్ట్రాలలో సైతం ఈ స్కీమ్ అమలు దిశగా అడుగులు పడటం జరిగింది. సంక్షేమ పథకాల పేరుతో చాలామంది నేతలు పేదలకు ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చని పథకాలను అమలు చేస్తున్నారు. అలా కాకుండా ప్రజలకు అవసరం అయిన ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు చేసే సంక్షేమ పథకాలను అమలు చేస్తే మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: