* వైయస్సార్  హయాంలో వచ్చిన ఆరోగ్యశ్రీ
* ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ ఆస్పత్రిలో కూడా చికిత్స
* రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డులు
* 20 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స


 ఏ ప్రభుత్వం అయినా సంక్షేమ పథకాలను అమలు చేయడం చాలా కామన్. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని... చాలా సమర్థవంతంగా అమలు చేస్తున్నాయి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు. పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన వైయస్ రాజశేఖర్ రెడ్డి.. 2004 సమయంలోనే ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకువచ్చారు. పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పట్టుకొని..  వారికి ఉచితంగా చికిత్స అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకురావడం జరిగింది.

 

కార్పొరేట్ లేదా ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిరుపేద ప్రజలకు ఉచితంగా.. వైద్యం అందించడమే ఈ పథకం లక్ష్యం. దీని అమలులో కూడా వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి సక్సెస్ చేయగలిగారు. దీంతో ప్రజల్లో ఈ పథకంపై అవగాహన పెరిగి అందరు.. మెచ్చుకోవడం కూడా జరిగింది. ఆరోగ్యశ్రీ పథకం అంటేనే వైయస్ రాజశేఖర్ రెడ్డి అందరికీ గుర్తుకు వస్తారు. అంతలా ఈ పథకం పాపులర్ అయింది.

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకువచ్చిన ఈ పథకాన్ని ఇప్పటికీ తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. తెలంగాణలో 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్... కాంగ్రెస్ పార్టీకి బద్ద వ్యతిరేకి. అయినప్పటికీ వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి తీసుకు వచ్చిన పథకాన్ని... ఆరోగ్యశ్రీ పేరుతోనే అమలు చేశారు.

 అయితే ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఉన్నన్ని రోజులు ఆరోగ్యశ్రీ పథకాన్ని చాలా సమర్థవంతంగా అమలు చేశారు.  తాజాగా ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే... ఆరోగ్యశ్రీ సేవలను ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో నిర్వహిస్తున్నారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చింది.  ఏది ఏమైనా ఆరోగ్యశ్రీ అనేది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: