* రేవంత్ పాలనలో ఫ్రీ బస్సు  
* తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
* ఆరు గారంటీల్లో భాగంగా ఫ్రీ బస్సు అమలు
* ఫ్రీ బస్సుతో మహిళలకు తగ్గిన ఆర్థిక భారం


 తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీని దించేసి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.  ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో 6 గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పదేపదే చెప్పింది. ఈ ఆరు గ్యారెంటీలలో.. ఫ్రీ బస్సు పథకం కూడా ఉంది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను  అమలు చేయలేదు కానీ... ఫ్రీ బస్సు మాత్రం సమర్థవంతంగా అమలు చేస్తోంది.

 ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వెంటనే ఈ పథకాన్ని ప్రారంభించింది రేవంత్ రెడ్డి సర్కార్. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు ఉచితంగా.. బస్సు ప్రయాణం కల్పించడం కోసమే ఫ్రీ బస్సు స్కీము తీసుకువచ్చారు. ఇక ఈ ఫ్రీ బస్సు స్కీం ద్వారా.. తెలంగాణలో ఉన్న ముసలి ముతక... రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళ...  ఉచితంగా ఎక్కడికైనా ప్రయాణించవచ్చు.

అదిలాబాదు నుంచి నల్గొండ వరకు... ఇటు హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు ఎక్కడికైనా... బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చు.  డీలక్స్, ఏసీ బస్సుల్లో తప్ప మిగతా ఆర్డినరీ బస్సుల్లో ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని అందిస్తున్నారు. ఇక ఈ ఉచిత బస్సు పథకానికి మంచి ఆదరణ మహిళల్లో వస్తోంది.

 ప్రతి చిన్న పనికి కూడా బస్సుల్లో వెళ్లి ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు తెలంగాణ వీర మహిళలు. అయితే కొన్ని చోట్ల ఉచిత బస్సు విషయంలో కొన్ని వివాదాలు కూడా జరుగుతున్నాయి.  కొంతమంది మహిళలు ఫ్రీ బస్సులో ప్రయాణించి బీడీలు, అల్లం ఎల్లిపాయ పొట్టు తీయడం  వివాదంగా మారింది. అంతేకాదు ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఆడినరీ సర్వీసుల సంఖ్యను బాగా తగ్గించారు. దీంతో సీట్ల కోసం జనాలు కొట్టుకుంటున్నారు. టికెట్లు కొనే మగవారికి మాత్రం సీట్లు దక్కడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: