- అద్భుత పథకాలకు ఆరాధ్యుడు వైఎస్.
- ప్రమాదంలో కాపాడిన 108 స్థాపకుడు
- ఎందరో ప్రాణాలను నిలిపిన  దీరుడు
-

 వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈయన పేరు చెప్తే ఇప్పటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఇంట్లో తప్పనిసరిగా ఏడుస్తారు. ఎందుకంటే ఆయన పాలన ద్వారా ప్రజలకు కొంత దగ్గరయ్యారు. చివరికి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అలాంటి వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అలుపెరుగని శ్రమ చేసి పేద ప్రజలను బాగు చేసే ఎన్నో పథకాలు తీసుకువచ్చారు. అలాంటి రాజశేఖర్ రెడ్డి గురించి ఒక్కమాటలో చెప్పాలంటే చాలా కష్టం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు  ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు ఇప్పటికీ  పేద ప్రజలకు అందుతూనే ఉన్నాయి. అలా పథకాలు అందించడంలో , వాటి రూపకల్పనలో వైయస్ రాజశేఖర్ రెడ్డి అగ్రగన్యుడు అని చెప్పవచ్చు. అలాంటి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి 108 ఎంతోమంది పేదలను  ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రాణాలు కాపాడుతోంది. ఆ పథకం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

 108తో ప్రాణాలు కాపాడిన ధీరుడు:
గత 20 సంవత్సరాల క్రితం తెలుగు రాష్ట్రంలో ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్ కి వెళ్లడానికి కనీస సౌకర్యాలు ఉండేవి కావు. సీరియస్ అయితే మాత్రం తప్పనిసరిగా మార్గమధ్యంలోనే చాలామంది ప్రాణాలు విడిచేవారు. దీనికి ప్రధాన కారణం స్పీడ్ గా ఆస్పత్రికి వెళ్లడానికి సౌకర్యాలు లేకపోవడమే. వైయస్ రాజశేఖర్ రెడ్డి తన పాదయాత్ర ఎప్పుడైతే ప్రారంభించారో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా తిరిగారు. గ్రామ గ్రామాన్ని టచ్ చేసారు. పేద ప్రజల సమస్యలను కళ్ళముందే చూశారు. తన పాదయాత్రలో ఎంతోమంది సీరియస్ అయితే వారిని ఆసుపత్రి తీసుకురావడానికి కనీస వాహనాలు లేకపోవడంతో చాలామంది ప్రాణాలు పోగొట్టుకోవడం ఆయన కళ్లారా చూసి చెలించిపోయారు. చివరికి పాదయాత్ర అనంతరం రాజశేఖర్ రెడ్డి పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు 108 అంబులెన్స్ ప్రతి గ్రామానికి ఎమర్జెన్సీ టైంలో వెళ్లాలని ఆలోచన చేశారు. 108 పథకాన్ని తీసుకువచ్చి ఎంతోమంది పేద ప్రజల ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు. ఆయన బీజం వేసిన 108 ఇప్పటికీ కొనసాగుతోంది. పేద ప్రజల ప్రాణాలను నిలుపుతోంది. దీంతో మారుమూల ప్రాంతాల్లో కూడా ఒక్క ఫోన్ కొడితే చాలు 108 కుయ్ కుయ్ కుయ్ అనుకుంటూ వచ్చి చాలామందిని సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడుతోంది. లక్షలాది మంది ప్రాణాలు కాపాడడంలో 108 పథకం కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. అలాంటి 108ను రాజశేఖర్ రెడ్డి ప్రారంభించి పేద ప్రజలకు దేవుడయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: