- నేతన్నలకు ఆసరా ఇచ్చిన ఎన్టీఆర్.
- పేద ప్రజలకు బట్టలు అందించిన ఘనుడు.
- ఆయన పథకాలు ఇప్పటికీ మరపురాని జ్ఞాపకాలే.!

తెలుగు రాష్ట్రాలను పాలించిన అత్యద్భుతమైన సీఎంలు ఎవరయ్యా అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే. ఈయన సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా చరిత్ర సృష్టించారు. అలాంటి సీనియర్ ఎన్టీఆర్ తీసుకొచ్చినటువంటి ఎన్నో పథకాలు ఇప్పటికీ పేద ప్రజలకు అందుతున్నాయి. కాదు కాదు పేద ప్రజల కడుపు నింపుతున్నాయి. అలా అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టడంలో సీనియర్ ఎన్టీఆర్ ప్రముఖమైన పాత్ర పోషించారని చెప్పవచ్చు. ఎవరు చేయని విధంగా ఆయన తీసుకొచ్చిన పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అలాంటి ఎన్టీఆర్ తీసుకొచ్చినటువంటి జనతా వస్త్రాల పథకం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

 ఎన్టీఆర్ జనతా వస్త్రాలు:
 సినిమా వాళ్ళను తక్కువ అంచనా వేయొద్దు ఏదైనా ఒక రోజు వారు ప్రపంచాన్ని మార్చేస్తారు అని  బిర్ నాడ్ షా మాటలు నిజం చేస్తూ సినిమా రంగం   నుంచి రాజకీయ రంగంలోకి వచ్చి తెలుగు రాష్ట్రాల భవిష్యత్తును మార్చారు సీనియర్ ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద ప్రజల, కార్మిక, కర్షకుల  నాయకుడిగా మారారు. పార్టీని స్థాపించిన సంవత్సరంలోపే పూర్తిస్థాయిలో అధికారంలోకి తీసుకువచ్చి దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ లక్ష్యంగా  ఒక అడుగు ముందుకు వేసి ప్రజల మనోభావాలను ప్రభావితం చేశాడు అన్న ఎన్టీఆర్. సమాజమే నా దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదంతో  పేద ప్రజల దేవుడయ్యాడు. అలాంటి ఎన్టీఆర్ ఎన్నో పథకాలు తీసుకువచ్చి పేద ప్రజలకు ఆసరాగా నిలిచాడు.


స్వాతంత్రం అనంతరం కాంగ్రెస్సేతర పార్టీని ఏర్పాటు చేసిన నాయకుడిగా చరిత్ర సృష్టించాడు. అలాంటి ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం, చిన్న మండలాల ఏర్పాటు, పేద ప్రజలకు భూ పంపిణీ  ఇలా ఎన్నో పథకాలు తీసుకొచ్చారు.ఈ పథకాల్లో అద్భుతమైన ఆదరణ పొందినటువంటి పథకం  జనతా వస్త్రాలు. ఈ పథకం ద్వారా  పేద ప్రజలకు సగం ధరకే దుస్తులు అందించాడు. అంతేకాదు ఈ పథకాన్ని ఎంతోమంది నేతన్నలకు అనుసంధానం చేసి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాడని చెప్పవచ్చు. ఈ విధంగా ఎన్టీఆర్ తీసుకొచ్చిన జనతా వస్త్రాలు పథకం, ప్రజల్లో మంచి ఆదరణ పొందింది. ఈ పథకాన్ని ఇప్పటికీ చంద్రబాబు నాయుడు  నడిపిస్తూనే ఉన్నాడని చెప్పవచ్చు. ఈ పథకం ద్వారా కనీసం దుస్తువులు కొనుక్కోలేనటువంటి పేద ప్రజలకు సగం ధరకే దుస్తులు అందించి పేదల ఆరాధ్య దైవంగా మారాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: