ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయ సిబ్బంది విధుల నిర్వహణ పైన ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. వాలంటీర్ల వ్యవస్థ పైన ప్రభుత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.ప్రస్తుతం వార్డు, గ్రామ సచివాలయ సిబ్బందితోనే పెన్షన్ల పంపిణీ కొనసాగిస్తోంది. సెప్టెంబర్ 1న పంపిణీ చేయాల్సిన పెన్షన్ల బాధ్యత వారికే అప్పగించనుంది. ఇదే సమయంలో ప్రభుత్వం మరో బాధ్యత అప్పగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గ్రామా అలాగే వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో బాధ్యత అప్పగించేందుకు చంద్రబాబు తత్కాల్ నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ల పరిశుభ్రత ఫోటోలను అప్లోడ్ చేసే బాధ్యతను విద్యాశాఖ గ్రామ అలాగే వార్డు సచివాలయాలకు అప్పగించడం జరిగింది.వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది విధుల నిర్వహణలో కూటమి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో పాఠశాలల మరుగుదొడ్ల ఫొటోలను అప్‌లోడ్‌ చేసే బాధ్యతను ప్రభుత్వం ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు(హెచ్‌.ఎం) అప్పగించారు. దీని పైన వారి నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దీంతో..కూటమి ప్రభుత్వం తాజాగా ఆ బాధ్యతల నుంచి వారిని తప్పించింది. ఇప్పుడు ఆ బాధ్యతలను సచివాలయ సిబ్బందికి అప్పగించాలని నిర్ణయించింది.రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల పరిశుభ్రతకు సంబంధించి ఫొటోలు తీసి, యాప్‌లో అప్‌లోడ్‌ చేసే బాధ్యతలను విద్యాశాఖ గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించింది. ఆయా సచివాలయాల్లోని ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, వార్డు ఎడ్యుకేషన్‌ కార్యదర్శి ప్రతి సోమ, గురువారాల్లో పాఠశాలలను సందర్శించి మరుగుదొడ్ల ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సమగ్రశిక్ష ఎస్పీడీ, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇన్‌చార్జ్‌ డైరెక్టర్‌ బి. శ్రీనివాసరావు ఆదేశాలు జారీచేశారు.దీనికిగాను పాఠశాల విద్యాశాఖ రూపొందించిన ఐఎంఎంఎస్‌ యాప్‌లో లాగిన్‌ అయ్యేందుకు వారికి అవకాశం కల్పించింది. అలాగే బుధ, గురువారాల్లో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీల చైర్మన్‌, సభ్యులు కూడా ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. దీంతో, గత ప్రభుత్వ హాయంలో పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు అప్పగించిన ఈ ఫొటోల బాధ్యతను ఇప్పుడు కూటమి ప్రభుత్వం సచివాలయ సిబ్బందికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయటంతో ఇక నుంచి ప్రతీ వారం కొత్త బాధ్యతలను సచివాలయ సిబ్బంది నిర్వహించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: